How to Get Government Group 2 Jobs and Job Roles-గవర్నమెంట్ గ్రూప్ 2 ఉద్యోగాలు పొందడం మరియు వాటి విధుల

By Vipstudent.online

Updated On:

Group 2 Jobs

Join WhatsApp Channel For Daily Updates

Join Now

Let’s Know About How To Get Government Group 2 Jobs and Job Roles – గవర్నమెంట్ గ్రూప్ 2 ఉద్యోగాలు పొందడం ఎలా మరియు వాటి విధుల గురించి తెలుసుకుందాం

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) గ్రూప్ 2 పోస్టుల నియామకం, అర్హతలు మరియు పదోన్నతుల నియమాలను నిర్ణయిస్తాయి. రాష్ట్రాల వారీగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేయబడిన అభ్యర్థులు గవర్నమెంట్ పరిపాలన విభాగంలోని గ్రూప్ 2 సర్వీసెస్ నందు డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, కమిషనర్ వంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నందు మరియు సీనియర్ అకౌంటెంట్స్, అసిస్టెంట్స్ ఆఫీసర్స్ వంటి నాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు నందు ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.

Required Qualification And Selection Process For Group 2 Jobs – గ్రూపు 2 ఉద్యోగాలకు కావలసిన అర్హతలు మరియు ఎంపిక విధానం

Group 2 Jobs NOTIFICATION – గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

గ్రూప్ 2 నోటిఫికేషన్ TSPSC/APPSC అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల అవుతుంది. దీనిలో పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు పరిమితులు, అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీలు, మొదలైనవి పొందుపరుస్తారు.

APPLICATION PROCESS – అప్లికేషన్ ప్రాసెస్

అభ్యర్థులు TSPSC/APPSC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు: సాధారణ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC/ST/PH అభ్యర్థులకు రాయితీ ఉంటుంది.

EDUCATIONAL QUALIFICATION – విద్యా అర్హత

గ్రూప్ 2 సర్వీసెస్ నందు ఉద్యోగం పొందడానికి అభ్యర్థి ఏదైనా భారత ప్రభుత్వం చే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ) నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి.

AGE LIMIT – వయసు పరిమితి:

సాధారణ వర్గం (General cotogiry) వారు18 సంవత్సరముల వయసు నుంచి 42 సంవత్సరముల వయసు వరకు గవర్నమెంట్ గ్రూప్ 2 ఉద్యోగాలు కొరకు ప్రయత్నం చేయుటకు అర్హులు.

రిజర్వ్డ్ కేటగిరీలు (SC/ST/BC) వారికి జనరల్ కేటగిరి వారి కంటే గరిష్టంగా 5 సంవత్సరాల వయసు వరకు సడలింపు ఉంటుంది.

పరిమిత శారీరక మాంద్యం కలిగిన (PWD) వారికి జనరల్ కేటగిరి వారి కంటే గరిష్టంగా 10 సంవత్సరాల వయసు వరకు సడలింపు ఉంటుంది.

Group 2 Jobs Exam Pattern : గ్రూప్ 2 ఉద్యోగాల పరీక్షా విధానం:

గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపిక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ద్వారా నిర్వహించబడటం జరుగుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది:

1. PRELIMINARY EXAM – ప్రిలిమినరీ (ప్రాథమిక) పరీక్ష:

ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ టైపు (మల్టిపుల్ ఛాయిస్)ప్రశ్నలతో ఉంటుంది.ఒకే పేపర్ ఉంటుంది. ఇది అర్హత పరీక్ష (qualifying exam) మాత్రమే.

ప్రశ్నల రకం: ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్).

సిలబస్: జనరల్ స్టడీస్, అర్ధమెటిక్, జనరల్ ఇష్యూస్(కరెంట్ అఫైర్స్).

2. MAINS EXAM – మెయిన్స్ పరీక్ష

ప్రిలిమినరీ పరీక్ష నందు క్వాలిఫై అయిన వారు మెయిన్స్ పరీక్ష నందు వివరణాత్మక ప్రశ్నలకు రాత పరీక్ష వ్రాయవలసి ఉంటుంది. ఇందులో ప్రధానంగా నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది.

1. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ

2. భారత రాజ్యాంగం, పాలన

3. ఆర్థిక వ్యవస్థ & అభివృద్ధి

4. భారత చరిత్ర & సాంస్కృతిక వారసత్వం

INTERVIEW – ఇంటర్వ్యూ

మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.ఇది 75 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ నందు అభ్యర్థి యోక్క వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందన శక్తిని అంచనా వేయడం జరుగుతుంది.

FINAL MERIT LIST – ఫైనల్ మెరిట్ లిస్టు

మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందిస్తారు.అభ్యర్థులను తుది ఎంపిక చేయడం మెరిట్ ఆధారంగా జరుగుతుంది. (ప్రతి దశలో కటాఫ్ మార్కులు మరియు ఇతర ప్రమాణాలు రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా మారుతాయి. కనుక అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలను జాగ్రత్తగా తెలుసుకోవటం ముఖ్యం).

DOCUMENT VERIFICATION – డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి, అన్ని వివరాలు సరైనవని నిర్ధారించిన తరువాత నియామక ఆర్డర్స్ ఇస్తారు.

Appointments And Allotments of Group 2 Jobs posts – గ్రూప్ 2 ఉద్యోగ పోస్టుల నియామకాలు మరియు కేటాయింపులు

ఎంపికైన అభ్యర్థులను వివిధ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ఆదాయ మరియు ఇతర ముఖ్యమైన విభాగాల్లో గ్రూపు 2 ఎగ్జిక్యూటివ్ – నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నందు నియమించడం జరుగుతుంది.

GROUP 2 EXECUTIVE POSTS AND ROLES – ఎగ్జిక్యూటివ్ పోస్టులు (గ్రూప్ 2 గెజిటెడ్ పోస్టులు) మరియు బాధ్యతలు:

DEPUTY TAHSILDAR – డిప్యూటీ తహసీల్దార్

భూ సంబంధిత సమస్యల పరిష్కారం.

భూమి రికార్డుల నిర్వహణ.

పన్నుల వసూలు, రెవెన్యూ కోర్టుల నిర్వహణ.

ప్రభుత్వ పాలనలో వివిధ అధికారులతో సమన్వయం.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ.

SUB REGISTRER- సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్ II)

ఆస్తుల రిజిస్ట్రేషన్ (లాండు డాక్యుమెంట్స్, ఇల్లు, స్థలాలు).

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వసూలు.

రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో నిబంధనల అమలు.

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లు జారీ చేయడం.

ASSISTANT COMMERCIAL TAX OFFICER – అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ACTO)

వ్యాపార సంస్థల నుంచి పన్నుల వసూలు.

GST అమలు, పన్ను అక్రమాలు గుర్తించి నివారణ.

పన్ను చెల్లింపుల తనిఖీ మరియు జోడింపు.

పన్ను సంబంధిత ప్రజల ఫిర్యాదుల పరిష్కారం.

MUNICIPAL COMMISSIONER GRADE 3 – మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ III)

నగర పాలనలో కీలక పాత్ర.

శుభ్రత, పారిశుధ్యం, మౌలిక వసతుల నిర్వహణ.

నగర అభివృద్ధి ప్రణాళికలు అమలు.

నగర పన్నుల వసూలు మరియు వినియోగం.

ASSISTANT SECTION OFFICER – అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)

ప్రభుత్వ కార్యాలయాల్లో దినచర్యల నిర్వహణ.

ఫైల్స్, నివేదికలు తయారు చేయడం.

సీనియర్ అధికారులకు తగిన సమాచారం అందించడం.

పత్రాల భద్రత, వర్గీకరణ.

ASSISTANT DEVELOPMENT OFFICER – అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్)

హ్యాండ్లూమ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు.

టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు.

ప్రభుత్వ స్కీంల అమలు.

సహకార సంఘాల పర్యవేక్షణ.

ASSISTANT LABOUR OFFICER – అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

కార్మికుల హక్కులు, శ్రేయస్సు కోసం చర్యలు.

చట్టాల అమలు (లేబర్ చట్టాలు).

ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం.

పరిశ్రమల తనిఖీలు నిర్వహణ.

SENIOR AUDITOR – FINANCE DEPARTMENT – సీనియర్ ఆడిటర్ (ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్)

ప్రభుత్వ ఖాతాల ఆడిట్.

ఫండ్‌ల వినియోగం పర్యవేక్షణ.

అక్రమ ఖర్చులను నివారించడం.

ఆర్థిక రిపోర్టులు తయారు చేయడం.

MANDAL PARISHAD DEVELOPMENT OFFICER – మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO)

గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టుల అమలు.

పంచాయతీ రాజ్ వ్యవస్థ పర్యవేక్షణ.

నిధుల కేటాయింపు, వినియోగం.

సంక్షేమ పథకాల అమలు.

REVENUE ASSISTANT – రెవెన్యూ అసిస్టెంట్

రెవెన్యూ రికార్డుల నిర్వహణలో తహసీల్దార్‌కు సహాయం.

పన్ను వసూలు విధుల్లో భాగస్వామ్యం.

భూ వివాదాల పరిష్కారానికి సహకారం.

JUNIOR EMPLOYMENT OFFICER – జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్

ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించడం.

నిరుద్యోగులకు శిక్షణ ప్రణాళికలు అందించడం.

ప్రభుత్వ ఉపాధి స్కీంల అమలు.

ఉద్యోగ ప్రకటనలు పర్యవేక్షణ.

GROUP 2 NON EXECUTIVE POSTS AND ROLES – నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల (గ్రూప్ 2 నాన్-గెజిటెడ్ పోస్టులు) మరియు బాధ్యతలు:

SENIOR ACCOUNTANT – సీనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ విభాగాల్లో)

ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిర్వహణ.

నిధుల కేటాయింపు, వినియోగం పర్యవేక్షణ.

బడ్జెట్ తయారీ, ఖర్చుల రిపోర్టు తయారు చేయడం.

ఆడిట్ పత్రాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ.

JUNIOR ASSISTANT – జూనియర్ అసిస్టెంట్ (వివిధ శాఖల్లో)

కార్యాలయ పనుల్లో సీనియర్ అధికారులకు సహాయం.

ఫైల్స్ నిర్వహణ, పత్రాల భద్రత.

డేటా ఎంట్రీ, అధికారిక లేఖల తయారీ.

వివిధ విభాగాల మధ్య సమన్వయం.

ASSISTANT IN POLICE DEPARTMENT – పోలీసు శాఖలో అసిస్టెంట్

పోలీసు కార్యాలయాల్లో దినచర్యల నిర్వహణ.

ఫిర్యాదుల నమోదు, పత్రాల నిర్వహణ.

పోలీసు చర్యలకు సంబంధించిన కార్యాలయ రిపోర్టుల తయారీ.

ఉన్నత అధికారులకు అవసరమైన సమాచారం అందించడం.

ASSISTANT IN FIRE DEPARTMENT – అగ్నిమాపక సేవల శాఖలో అసిస్టెంట్

అగ్నిమాపక సేవలకు సంబంధించిన రిపోర్టుల నిర్వహణ.

ఆపత్కాలీన పరిస్థితుల్లో ఫిర్యాదుల నమోదు.

ఫైర్ స్టేషన్ కార్యకలాపాల్లో సహకారం.

ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుకు పర్యవేక్షణ.

ASSISTANT IN CIVIL SUPPLY DEPARTMENT – సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్

ప్రజలకు నిత్యావసర సరుకుల సరఫరాలో సమన్వయం.

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) పర్యవేక్షణ.

నాణ్యమైన సరుకుల అందుబాటును పర్యవేక్షించడం.

రేషన్ కార్డుల నిర్వహణకు సహకారం.

ASSISTANT STATISTICAL OFFICER – అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్

డేటా సేకరణ, విశ్లేషణ.

శాస్త్రీయ రిపోర్టుల తయారీ.

ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడం.

స్టాటిస్టికల్ చార్ట్స్, రిపోర్టులు రూపొందించడం.

TYPIST CUM ASSISTANT – టైపిస్ట్-కమ్-అసిస్టెంట్

కార్యాలయ పత్రాలను టైప్ చేయడం.

అధికారి లేఖలు, నివేదికల తయారీ.

దస్త్రాల నిర్వహణ, కార్యాలయ పర్యవేక్షణ.

ఫైలింగ్ మరియు రికార్డ్ నిర్వహణ.

WELFARE ORGANISER – వెల్ఫేర్ ఆర్గనైజర్

సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ.

లబ్ధిదారుల ఎంపిక, ఫిర్యాదుల పరిష్కారం.

సామాజిక సంక్షేమం కోసం కార్యక్రమాల నిర్వహణ.

ప్రభుత్వ సంక్షేమ స్కీంల ప్రచారం.

ASSISTANT IN PANCHAYATI RAJ AND VILLAGE DEVELOPMENT DEPARTMENT – పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్

పంచాయతీ కార్యాలయ పనుల్లో భాగస్వామ్యం.

గ్రామీణ అభివృద్ధి పథకాల అమలు.

గ్రామసభ సమావేశాల నిర్వహణ.

ప్రజా సమస్యల పరిష్కారం.

ASSISTANT IN LAW AND LEGISLATIVE AFFAIRS DEPARTMENT – చట్టం మరియు శాసన వ్యవహారాల శాఖలో అసిస్టెంట్

చట్టపరమైన పత్రాల నిర్వహణ.

న్యాయశాఖ అధికారుల పనికి సహకారం.

కేసుల రికార్డుల నిర్వహణ.

చట్ట సంబంధిత సమాచారం సిద్ధం చేయడం.

CLOSING SENTENCE – ముగింపు వాక్యం

గ్రూప్ 2 ఉద్యోగాలు సామాజిక సంక్షేమానికి, ప్రభుత్వ కార్యాలయ నిర్వహణకు కీలకంగా ఉంటాయి. ప్రజాసేవలో చురుకుగా పనిచేయడం ఈ ఉద్యోగాల ప్రధాన లక్ష్యం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ ను ఫాలో అవుతూ నిర్దిష్టమైన ప్రణాళిక తో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ భారత రాజ్యాంగము పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థ భారతదేశ చరిత్ర సంస్కృతి మరియు సమాజం గురించిన సబ్జెక్టుల నందు అవగాహన పెంపొందించుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు పొందవచ్చును.

SHORT QUIZ ON GOVERNMENT GROUP 2 JOBS AND JOB ROLES – గవర్నమెంట్ గ్రూప్ టు ఉద్యోగాలు మరియు ఉద్యోగ విధులు నందు షార్ట్ క్విజ్

1. What is the minimum age limit to apply for Government Group 2  Jobs?
గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు ఎంత?

A. 18 years/ 18 సంవత్సరాలు
B. 20 years/20 సంవత్సరాలు
C. 21 years/ 21 సంవత్సరాలు
D. 25 years/25 సంవత్సరాలు

2. Which stage is NOT a part of the Group 2 Jobs selection process?
గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియలో భాగం కానిది ఏది?

A. Preliminary Exam/ప్రిలిమినరీ ఎగ్జామ్
B. Mains Exam/మెయిన్స్ ఎగ్జామ్
C. Interview/ఇంటర్వ్యూ
D. Physical Test/ఫిజికల్ టెస్ట్

3. What is the educational qualification required for Group 2 Jobs?
గ్రూప్ 2 ఉద్యోగాలకు కావలసిన విద్యా అర్హత ఏమిటి?

A. 10th pass/టెన్త్ పాస్
B. Diploma/డిప్లొమా
C. Any Bachelor’s Degree/ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
D. Post Graduation/పోస్ట్ గ్రాడ్యుయేషన్

4. What is the role of a Deputy Tahsildar?
డిప్యూటీ తహసీల్దార్ బాధ్యత ఏమిటి?

A. Supervising fire safety regulations/
B. Maintaining land records and resolving revenue disputes/ల్యాండ్ రికార్డ్స్ మెయింటెనెన్స్ మరియు రెవెన్యూ వివాదాల పరిష్కారాలు
C. Conducting employment training programs/ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహణ
D. Registration of property documents/ప్రాపర్టీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్

5. Which department is responsible for releasing the Group 2 Jobs notification?
గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసే శాఖ ఏమిటి?

A. Revenue Department/రెవెన్యూ డిపార్ట్మెంట్
B. State Public Service/ Commission (TSPSC/APPSC)/స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
C. Police Department/పోలీస్ డిపార్ట్మెంట్
D. Panchayati Raj Department/పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్

SHORT QUIZ ANSWERS – షార్ట్ క్విజ్ సమాధానాలు

1). A. 18 years/18 సంవత్సరాలు

2). D. Physical Test/ఫిజికల్ టెస్ట్

3). C. Any Bachelor’s Degree/ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ

4). B. Maintaining land records and resolving revenue disputes/ల్యాండ్ రికార్డ్స్ పరిరక్షణ మరియు రెవిన్యూ వివాదాల పరిష్కారాలు

5). B. State Public Service Commission (TSPSC/APPSC)/స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

Vipstudent.online

Welcome to Vipstudent.Online - The Future Of The Nation! Vipstudent.online is an exclusive career growth platform and community for students and individuals to empower themselves by enhancing their educational and professional skills and knowledge.

Leave a Comment