11. How To Become An Engineer And divisions Of Engineering-ఇంజనీర్ అవటం ఎలా మరియు ఇంజనీరింగ్ లోని విభాగాలు

By Vipstudent.online

Updated On:

How To Become An Engineer And divisions Of Engineering

Join WhatsApp Channel For Daily Updates

Join Now

How to Become an Engineer and Divisions of Engineering – ఇంజనీర్ అవ్వడం ఎలా మరియు ఇంజనీరింగ్ విభాగాలు

ఇంజినీరింగ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖమైన వృత్తి గా పరిగణించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ నందు ఆసక్తి కలవారు ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్ నందు ఎంపీసీని (M.P.C) పూర్తి చేసి జేఈఈ మెయిన్స్ (JEE MAINS),జేఈఈ అడ్వాన్స్డ్ (JEE ADVANCED) ,ఎంసెట్ (EMCET ) వంటి ఎంట్రన్స్ టెస్ట్ ల ద్వారా లేదా పాలిటెక్నిక్ పూర్తి చేసి ఈసెట్ (ECET) వంటి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E)/బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) నందు కంప్యూటర్ సైన్సు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మరియు సాఫ్ట్వేర్ వంటి అనేక విభాగాల నందు ఇంజనీరింగ్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఆయా విభాగాల నందు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో ఇంజనీర్లుగా స్థిరపడవచ్చున

Educational Qualifications to Become a Engineer – ఇంజనీర్ అవ్వటానికి కావలసిన విద్యార్హతలు

పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ / 10+2 నందు సైన్స్ స్ట్రీమ్ లో M.P.C గ్రూప్ ను ఎంచుకుని ఉత్తీర్ణులు అయి ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది.ఇందులో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. లేదా 10 వ తరగతి తరవాత పాలిటెక్నిక్ పూర్తి చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది

Entrance Tests for Engineering – ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం వివిధ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ నందు ప్రవేశం కొరకు నిర్వహించే ప్రతి ఎంట్రన్స్ టెస్ట్ ల నందు నిర్ణీత సమయము మరియు నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ నందు వ్యత్యాసం ఉంటుంది.

JEE Main – జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్

NITs నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIITs ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మరికొన్ని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించబడే JEE Main పరీక్ష నందు అర్హతను సాధించవలసి ఉంటుంది. JEE MAIN మొత్తం 90 ప్రశ్నలతో 300 మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది మరియు మూడు గంటల సమయం ఉంటుంది.

question 1: ఇంజనీరింగ్ లో ప్రవేశం పొందడానికి ప్రధానమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు ఏమిటి?
a) EMCET, ECET
b) JEE Main, JEE Advanced
c) VITEEE, BITSAT
d) NEET, AIIMS

JEE Advanced – జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్

JEE Main లో అర్హత సాధించిన విద్యార్థులు మాత్రమే JEE Advanced పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు. భారతదేశంలోని IITs ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ విద్య నందు ప్రవేశం పొందటానికి JEE Advanced పరీక్ష నందు అర్హత సాధించవలసి ఉంటుంది.JEE ADVANCED పరీక్ష నందు ప్రతి సంవత్సరం ప్రశ్న పత్రంలోనీ ప్రశ్నలు సంఖ్య మరియు సమయము నందు మార్పు ఉంటుంది.

Question 2: JEE Advanced పరీక్ష రాయడానికి అర్హత పొందడానికి ముందుగా ఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి?
a) VITEEE
b) BITSAT
c) JEE Main
d) ECET

State Level Entrance Exams for Engineering – ఇంజనీరింగ్ కొరకు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు

ఇంజనీరింగ్ నందు ప్రవేశము కొరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైన ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలు నందు ప్రవేశం కొరకు EAMCET – ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నందు అర్హత సాధించవలసి ఉంటుంది. EMCET ఎగ్జామ్ నందు మొత్తం 160 ప్రశ్నలతో 160 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది మరియు మూడు గంటల సమయం ఉంటుంది.

Question 3: ఎమ్సెట్ (EMCET) పరీక్షలో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?
a) 90 ప్రశ్నలు
b) 125 ప్రశ్నలు
c) 130 ప్రశ్నలు
d) 160 ప్రశ్నలు

Private College Entrance Exams for Engineering – ఇంజనీరింగ్ కొరకు ప్రైవేట్ కాలేజీల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్

కొన్ని ప్రముఖమైన ప్రైవేట్ యూనివర్సిటీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు ఇంజనీరింగ్ విద్య నందు ప్రవేశం కొరకు తమ సొంత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయి.

BITSAT – బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్స్ టెస్ట్ నందు అర్హత సాధించి – బిట్స్ పిలానీ మరియు దాని క్యాంపస్‌లలో ఇంజనీరింగ్ లో ప్రవేశం పొందవచ్చును.BITSAT పరీక్ష నందు మొత్తం 130 ప్రశ్నలతో 390 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది మరియు మూడు గంటల సమయం ఉంటుంది.

VITEEE – వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నందు అర్హత సాధించి VIT యూనివర్సిటీలో మరియు దాని క్యాంపస్లలో ఇంజనీరింగ్ నందు ప్రవేశం పొందవచ్చును.VITEEE పరీక్ష నందు మొత్తం 125 ప్రశ్నలతో 125 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది మరియు రెండున్నర గంటల సమయం ఉంటుంది.

Polytechnic to Engineering entrance exam – పాలిటెక్నిక్ నుండి ఇంజనీరింగ్ కు ప్రవేశ పరీక్ష

ఇంజనీరింగ్ నందు ప్రవేశము కొరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రవేశ పరీక్ష విధానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ నందు ప్రవేశము కొరకు ఈసెట్ ECET ఎగ్జామినేషన్ నందు అర్హత సాధించవలసి ఉంటుంది.ECET పరీక్ష నందు మొత్తం 200 ప్రశ్నలతో 200 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది మరియు మూడు గంటల సమయం ఉంటుంది.

Preparation for Engineering Entrance Exams – ప్రవేశ పరీక్షల కోసం సిద్ధం కావడం

చాలావరకు ఇంటర్మీడియట్ కాలేజీలు సైన్స్ స్ట్రీమ్ నందు ఎంపీసీ కోర్స్ తో పాటు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కొరకు కోచింగ్ అందించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత కోచింగ్ తీసుకుని లేదా సొంతంగా ప్రిపేర్ అయ్యి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్టుల నందు పాల్గొనవచ్చును.

ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల నందు పూర్తిగా పట్టు సాధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్లను అనుసరించి మోక్ టెస్ట్లను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండటం ద్వారా ఒత్తిడి లేకుండా టైం మేనేజ్మెంట్ తో ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మంచి ప్రతిభను కనుపరచవచ్చును.

Choosing a Engineering Course /Branch – ఇంజనీరింగ్ కోర్సు/బ్రాంచ్ ఎంపిక

ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మీకు వచ్చిన స్కోరు మరియు ర్యాంక్ ఆధారంగా, మీకు ఆసక్తి ఉన్న రంగంలో లేదా మార్కెట్లో డిమాండ్ మరియు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఇంజనీరింగ్ నందు మీ కోర్సు/బ్రాంచ్‌ను ఎంచుకోవచ్చును.

Engineering Courses/Branches – – ప్రముఖమైన ఇంజనీరింగ్ కోర్సులు/ బ్రాంచ్ లు

Computer Science and Engineering (CSE) – కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE) – Become An Engineer

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ( CSE ) బ్రాంచ్ నందు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆల్గోరిథమ్స్, మరియు సిస్టమ్ డిజైన్‌ వంటి అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో డేటా స్ట్రక్చర్స్ మరియు ఆల్గోరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషీన్ లెర్నింగ్
వంటివి ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, సిస్టమ్ అనలిస్ట్, AI ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Question 4: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE) ప్రధాన సబ్జెక్టులలో ఒకటి కాదు:
a) డేటా స్ట్రక్చర్స్
b) థర్మోడైనమిక్స్
c) ఆల్గోరిథమ్స్
d) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Mechanical Engineering – మెకానికల్ ఇంజనీరింగ్ – Become An Engineer

మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నందు యంత్రాల రూపకల్పన, విశ్లేషణ, తయారీ, మరియు నిర్వహణ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషీన్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెసెస్ వంటివి ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మెకానికల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఆటోమొబైల్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Civil Engineering – సివిల్ ఇంజనీరింగ్  -Become An Engineer

సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ నందు భవనాలు, రోడ్లు, బ్రిడ్జిలు, మరియు డ్యామ్‌ల నిర్మాణం మరియు నిర్వహణ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ వంటివి ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత సివిల్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, కన్‌స్ట్రక్షన్ మేనేజర్, అర్బన్ ప్లానర్ ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Electrical and Electronics Engineering (EEE) – ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) – Become An Engineer
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సు నందు
విద్యుత్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్, మరియు ఎలెక్ట్రోమాగ్నెటిజం పంపి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు ఈ కోర్సు నందు సర్క్యూట్ అనాలిసిస్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్ వంటివి ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్, పవర్ సిస్టమ్ ఇంజనీర్, కంట్రోల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Electronics and Communication Engineering (ECE) – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) Become An Engineer

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సు నందు ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మరియు సంబంధిత సాంకేతికతల రూపకల్పన వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు అనలాగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ వంటివి ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత కమ్యూనికేషన్ ఇంజనీర్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, నెట్‌వర్క్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Information Technology (IT) – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) – Become An Engineer

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు నందు కంప్యూటర్ మరియు టెలికమ్యూనికేషన్ ఆధారంగా సమాచారం స్టోర్, రీట్రీవ్ మరియు  ట్రాన్స్‌మిట్ చేయడం పంపి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు వెబ్ డెవలప్‌మెంట్, డేటా స్ట్రక్చర్స్, నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ వంటివి ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత IT మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, నెట్‌వర్క్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ గా ఉద్యోగాలు పొందవచ్చును.

Chemical Engineering – కెమికల్ ఇంజనీరింగ్ – Become An Engineer

కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు నందు రసాయన శాస్త్రం మరియు జీవ శాస్త్రాలను కలిపి రసాయనాలు మరియు ఉత్పత్తులను తయారుచేయడం వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు ప్రాసెస్ ఇంజనీరింగ్, కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వంటివి ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత కెమికల్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Aerospace/Aeronautical Engineering – ఏరోస్పేస్/ఏరోనాటికల్ ఇంజనీరింగ్

ఎరోస్పేస్ / ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు నందు విమానాలు మరియు అంతరిక్ష వాహనాల రూపకల్పన, తయారీ, మరియు నిర్వహణ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు ఏరోడైనమిక్స్, ప్రోపల్షన్ సిస్టమ్స్, ఫ్లైట్ మెకానిక్స్, అవియానిక్స్ వంటివి ప్రధాన సభ్యులుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఏరోస్పేస్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రీసెర్చ్ సైంటిస్ట్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Agricultural Engineering – అగ్రికల్చరల్ ఇంజనీరింగ్

అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు నందు వ్యవసాయ పరికరాల రూపకల్పన, నీటి నిర్వహణ, మరియు వ్యవసాయ విధానాల మెరుగుదల వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు మట్టీ మరియు నీటి ఇంజనీరింగ్, ఫార్మ్ మెషినరీ, నీటి పంపిణీ వ్యవస్థలు, వ్యవసాయంలో పునరుత్పాదక శక్తి వంటివి ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి.
ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత అగ్రికల్చరల్ ఇంజనీర్, నీటి నిర్వహణ ఇంజనీర్, ఫార్మ్ ఎక్విప్మెంట్ స్పెషలిస్ట్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Biotechnology Engineering – బయోటెక్నాలజీ ఇంజనీరింగ్
బయో టెక్నాలజీ ఇంజనీరింగ్ కోర్స్ నందు ఇంజనీరింగ్ సిద్ధాంతాలను జీవ శాస్త్రంతో కలిపి టెక్నాలజీలు మరియు ఉత్పత్తులను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు జెనెటిక్ ఇంజనీరింగ్,మాలిక్యులర్ బయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోప్రాసెస్ ఇంజనీరింగ్ వంటివి ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత బయోటెక్నాలజిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, క్వాలిటీ అనలిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Environmental Engineering – ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్
ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సు నందు పర్యావరణ సమస్యలను పరిష్కరించడం, కాలుష్య నియంత్రణ, మరియు వనరుల నిర్వహణ వంటి అంశాల పై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు నీటి మరియు వ్యర్థాల నిర్వహణ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, గాలి కాలుష్యం నియంత్రణ వంటివి ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, సస్టైనబిలిటీ కన్సల్టెంట్, వ్యర్థాల నిర్వహణ నిపుణుడు గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Metallurgical and Materials Engineering – మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్

మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కోర్సు నందు లోహాలు, పదార్థాలు, మరియు వాటి లక్షణాలను పరిశీలించి పరిశ్రమలో ఉపయోగించడం వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు ఫిజికల్ మెటలర్జీ, ఎక్స్‌ట్రాక్షన్ మెటలర్జీ, మెటీరియల్ టెస్టింగ్ మరియు చరిత్ర వంటివి ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మెటలర్జికల్ ఇంజనీర్, మెటీరియల్ సైంటిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Question  5 : మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ లో ప్రధాన సబ్జెక్టు ఏమిటి?
a) ఫిజికల్ మెటలర్జీ
b) వెబ్ డెవలప్‌మెంట్
c) మైక్రోప్రాసెసర్స్
d) ఫ్లైట్ మెకానిక్స్

Automobile Engineering – ఆటోమొబైల్ ఇంజనీరింగ్

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ నందు వాహనాల రూపకల్పన, తయారీ, మరియు నిర్వహణపై వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు వాహన డిజైన్,ఇంజిన్ టెక్నాలజీ, వాహన డైనమిక్స్ వంటివి ప్రధాన సభ్యులుగా ఉంటాయి.
ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆటోమొబైల్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Mechatronics Engineering – మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్

మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సు నందు మెకానికల్, ఎలక్ట్రికల్, మరియు కంప్యూటర్ సిస్టమ్స్‌ను కలిపి ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మరియు ఆటోమేషన్‌ను రూపొందించడం వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు రోబోటిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సెన్సర్ టెక్నాలజీ వంటివి ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మెకాట్రానిక్స్ ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Industrial and Production Engineering – ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్

ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కోర్స్ నందు సంక్లిష్టమైన ప్రక్రియలు, వ్యవస్థలు మరియు సంస్థలను ఆప్టిమైజ్ చేయడం వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు నందు ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వంటివి ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీర్, ప్రొడక్షన్ మేనేజర్, ఆపరేషన్స్ అనలిస్ట్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Marine Engineering – మారైన్ ఇంజనీరింగ్

మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ నందు సముద్ర నౌకలు, నౌకా నిర్మాణం మరియు సముద్ర సంబంధిత నిర్మాణాల రూపకల్పన వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కోర్స్ నందు నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ప్రోపల్షన్, ఓషన్ ఇంజనీరింగ్ వంటివి ప్రధాన సబ్జెక్టులు గా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మారైన్ ఇంజనీర్, షిప్‌యార్డ్ ఇంజనీర్, ఆఫ్షోర్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

Specialized Engineering Fields – ప్రత్యేక ఇంజనీరింగ్ రంగాలు

ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, సెరామిక్ ఇంజనీరింగ్, మరియు మరెన్నో ప్రత్యేక రంగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Closing Sentence – ముగింపు వాక్యం

ఇంజనీరింగ్‌లో ప్రవేశం అనేది సమర్థత, పట్టుదల, మరియు ప్రిపరేషన్ పై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు తమ ఆసక్తులు, మార్కెట్లో అవకాశాలు, మరియు భవిష్యత్తు లక్ష్యాలను పరిగణలోకి తీసుకుని సరైన కోర్సు లేదా బ్రాంచ్ ఎంచుకోవాలి. ఎంట్రన్స్ పరీక్షలు కొరకు సరైన ప్రిపరేషన్ మరియు సమయం నిర్వహణ అనేది విజయం సాధించేందుకు ముఖ్యమైనది. ఇంజనీరింగ్ నందు విద్యార్థులు తమ అంకితభావంతో గట్టి కృషి చేస్తే, వారు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చును.

Participate in daily short quiz to pass the Weekly Scolorship Eligibility Quiz  and to Achive Gold, Silver and Bronze medals on your Universal Knowledge

ప్రతిరోజూ షార్ట్ క్విజ్‌ లో పాల్గొని వారానికోసారి నిర్వహించే స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ క్విజ్‌ నందు ఉత్తీర్ణులు అవ్వండి మరియు మీ యూనివర్సల్ నాలెడ్జ్‌ నందు గోల్డ్, సిల్వర్, బ్రాన్జ్ పతకాలను సాధించండి!

0 votes, 0 avg
5

11. Become An Engneer and Types Of Engineering - ఇంజనీర్ అవ్వటం ఎలా? ఇంజనీరింగ్ నందు రకాలు..

Practice Quiz To Participate In Scolorship Eligibility Quiz 12 And To Achive Gold,Silver And Bronge Medals On Your Knowledge

1 / 5

 ఇంజనీరింగ్ లో ప్రవేశం పొందడానికి ప్రధానమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు ఏమిటి?
What are the main national-level entrance exams for admission into Engineering?

2 / 5

2. ఎమ్సెట్ (EMCET) పరీక్షలో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?
How many total questions are there in the EMCET exam?

3 / 5

 JEE Advanced పరీక్ష రాయడానికి అర్హత పొందడానికి ముందుగా ఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి?
To be eligible for JEE Advanced, which exam must be qualified first?

4 / 5

 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE) ప్రధాన సబ్జెక్టులలో ఒకటి కాదు:
Which of the following is not a core subject in Computer Science and Engineering (CSE)?

5 / 5

5. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ లో ప్రధాన సబ్జెక్టు ఏమిటి?
What is a core subject in Metallurgical and Materials Engineering?

Your score is

Vipstudent.online

Welcome to Vipstudent.Online - The Future Of The Nation! Vipstudent.online is an exclusive career growth platform and community for students and individuals to empower themselves by enhancing their educational and professional skills and knowledge.

Leave a Comment