LET’S KNOW ABOUT HOW TO BECOME A HR PROFESSIONAL AND CAREER OPPORTUNITES – ప్రొఫెషనల్ హెచ్ ఆర్ అవ్వటం ఎలా మరియు కెరియర్ అవకాశాలు గురించి తెలుసుకుందాము.
BECOME A HR PROFESSIONAL AND CAREER OPPORTUNITES: ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో హెచ్ఆర్ (HR) కు చాలా డిమాండ్ ఉంది. వ్యాపార సంస్థల అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేయటం,ఉద్యోగుల సంక్షేమం, సంబంధాల నిర్వహణ వంటి రంగాల్లో హెచ్ఆర్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వారు లేదా బి బి ఏ(BBA), ఎంబీఏ (MBA) వంటి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు చేసిన వారు హెచ్ఆర్ అసిస్టెంట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, టాలెంట్ అక్విజిషన్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ బిజినెస్ పార్టనర్, ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్ మేనేజర్, కంపెన్సేషన్ మరియు బెనిఫిట్స్ స్పెషలిస్ట్ గా పలు సంస్థల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
SUCCESS IN CAREER / భవిష్యత్తు నందు విజయం : ప్రతీ విద్యార్థి వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించటానికి మరియు కెరియర్ నందు విజయవంతంగా స్థిరపడటానికి అకాడమిక్స్(Acadamics) అనగా పుస్తకాలలో ఉండే నాలెడ్జ్ తో పాటు జనరల్ స్టడీస్ (General Studies), టెక్నాలజీస్ (Technologies), హిస్టరీ (History), రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు ( International, National, State Current Affairs), వృత్తి పరమయిన స్కిల్స్ (Professional Skills), బిజినెస్ స్కిల్స్ (Business Skills), ఆర్థిక అంశాల నిర్వహణ స్కిల్స్ (Economic Management Skills), పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ (Personality Development Skills) నందు కూడా మీ జనరల్ నాలెడ్జ్ ను పెంపొందించుకొని విద్యార్థి దశ నుండే విజయం వైపు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.
Required Education Qualification to become professional HR – ప్రొఫెషనల్ హెచ్ ఆర్ (H R) అవ్వడానికి కావలసిన విద్యా అర్హతలు:
పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఏదైనా గ్రూపు నందు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కామర్స్, ఆర్ట్స్ లేదా సైన్స్ స్ట్రీమ్స్ నందు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవలెను. డిగ్రీ నందు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com), BA సైకాలజీ, BA సోషల్ వర్క్ వంటి కోర్సులు చేసిన వారికి హెచ్ఆర్ రంగంలో ప్రవేశించడానికి మంచి పునాది లభిస్తుంది.
Human resource (HR) courses – హ్యూమన్ రిసోర్స్ (HR) కోర్సులు
ఏదైనా విభాగం నందు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహించే ఐసెట్ ICET లేదా CAT, MAT, XAT, CMAT వంటి ఎంట్రన్స్ టెస్టుల నందు అర్హత సాధించి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ M.B.A కోర్సు నందు అడ్మిషన్ పొంది అందులో హ్యూమన్ రిసోర్స్ నందు స్పెషలైజేషన్ పొందవచ్చును. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (PGDHRM) లేదా PHR, SHRM – CP వంటి షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను పూర్తి చేయవలసి ఉంటుంది.
గ్రాడ్యుయేషన్ లేదా హ్యూమన్ రిసోర్స్ కోర్సులు చేసేటప్పుడు ఏదైనా సంస్థ నందు ఇంటెర్న్ గా జాయిన్ అయ్యి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నందు సహాయ పనులు నిర్వర్తిస్తూ ఆయా విభాగాల పట్ల ఇంటర్ షిప్ ద్వారా అవగాహన పెంపొందించుకోవడం అనేది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో మీ భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది.
అవసరమైన స్కిల్స్ (Skills Required for HR)
హెచ్ఆర్గా పని చేయాలంటే కేవలం విద్యార్హతలు సరిపోవు. మీలో ఈ క్రింది నైపుణ్యాలు ఉండాలి:
-
కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills)
-
లీడర్షిప్ అండ్ మానేజ్మెంట్ (Leadership & People Management)
-
ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం (Interview Handling)
-
ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్ (Problem-Solving)
-
లేబర్ లా నాలెడ్జ్ (Knowledge of Labor Laws)
-
MS Office మరియు HR Softwareలపై అవగాహన
ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ (Practical Experience)
డిగ్రీ పూర్తయిన తరువాత నేరుగా హెచ్ఆర్ మేనేజర్‌గా అవకాశం రావడం కష్టం. మొదట జూనియర్ లెవెల్లో పని చేయాలి:
-
ఇంటర్న్‌షిప్ – డిగ్రీ లేదా MBA సమయంలోనే మంచి కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయండి.
-
HR Assistant లేదా HR Trainee లాంటి జూనియర్ ఉద్యోగాల్లో చేరండి.
-
రీజ్యూమ్ను అప్డేట్ చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరయ్యే ముందు ప్రాక్టీస్ చేయండి.
హెచ్ఆర్లో వేర్వేరు విభాగాలు (Different Roles in HR)
హెచ్ఆర్లో అనేక రకాల పనులు ఉంటాయి. మీ ఆసక్తికి తగిన విభాగాన్ని ఎంచుకోవచ్చు :
1. Recruitment & Staffing (నియామకాలు మరియు ఉద్యోగుల నియామకం):
ఈ విభాగం ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం, ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం వంటి పనులను చేస్తుంది. సరైన వ్యక్తిని సరైన ఉద్యోగానికి ఎంపిక చేయడం ముఖ్యమైన బాధ్యత.
2. Training & Development (శిక్షణ మరియు అభివృద్ధి):
ఇది ఉద్యోగులకు అవసరమైన శిక్షణలు ఇవ్వడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు ఉద్యోగ అభివృద్ధికి మార్గదర్శనం చేయడం ఈ విభాగంలో చేస్తారు.
3. Employee Relations (ఉద్యోగుల సంబంధాలు):
ఈ విభాగం ఉద్యోగులు మరియు సంస్థ మధ్య మంచి సంబంధాలు ఉండేలా చూస్తుంది. సమస్యలు, ఫిర్యాదులు, దౌర్జన్యాలు వంటి విషయాలను పరిష్కరించడం ఈ విభాగం బాధ్యత.
4. Compensation & Benefits (జీతాలు మరియు లాభాలు):
ఉద్యోగులకు జీతాలు, బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలు వంటి అంశాలను నిర్వహించే విభాగం. సరైన జీత నిర్మాణం తయారు చేయడం మరియు లాభాల పరంగా ఉద్యోగులను సంతృప్తిపరిచేలా చూడటం లక్ష్యం.
5. Performance Management (ప్రదర్శన నిర్వహణ):
ఉద్యోగుల పనితీరును అంచనా వేయడం, వారికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, మెరుగుదల కోసం చర్యలు తీసుకోవడం ఇందులోకి వస్తుంది. ప్రతిభ ఆధారంగా పురస్కారాలు ఇవ్వడం కూడా దీనిలో భాగం.
6. HR Analytics (హెచ్ఆర్ విశ్లేషణ):
డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునే విభాగం ఇది. ఉద్యోగుల పనితీరు, ఉద్యోగ వ్యవస్థापन, వినియోగం, సమర్థత వంటి అంశాలపై గణాంకాలు మరియు విశ్లేషణ చేయడం ఇందులో ఉంటుంది.
సర్టిఫికేషన్లు చేసుకోవడం (Useful HR Certifications)
మీ ప్రొఫైల్‌కు విలువ పెరగాలంటే కొన్ని ఇంటర్నేషనల్ లేదా నేషనల్ సర్టిఫికేషన్లు ఉపయోగపడతాయి:
-
SHRM-CP / SHRM-SCP (Society for Human Resource Management)
-
HRCI Certifications (aPHR, PHR, SPHR)
-
NIPM Certification (India Based)
-
SAP SuccessFactors, Zoho People, Darwinbox లాంటి HR Softwareలపై కోర్సులు
ఇంటర్వ్యూకు సిద్ధం కావడం (Prepare for HR Interviews)
హెచ్ఆర్ జాబ్ ఇంటర్వ్యూకు ముందుగా కొన్ని విషయాలు ప్రాక్టీస్ చేయండి:
-
మీ విద్య, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టులపై క్లియర్ గా మాట్లాడండి
-
Behavioral Interview Questions కు సన్నద్ధం అవ్వండి
-
HR Case Studies ప్రాక్టీస్ చేయండి
-
Resume, Cover Letterను ప్రొఫెషనల్‌గా రెడీ చేయండి
ఉద్యోగ అవకాశాల కోసం శోధన (Job Search Strategy)
-
Job Portals: Naukri, Indeed, Monster, LinkedIn లాంటి వెబ్సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేయండి.
-
Campus Placements: మంచి కాలేజీలో చదివితే ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువ.
-
Walk-in Interviews మరియు Referral Jobs కోసం కనెక్షన్లను పెంచుకోండి.
-
LinkedIn Profileను ప్రొఫెషనల్‌గా నిర్వహించండి.
కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? (Career Growth in HR Field)
హెచ్ఆర్ కెరీర్ మొదట జూనియర్ లెవెల్లో ప్రారంభమవుతుంది. అనుభవంతో పాటు స్కిల్స్ పెంచుకుంటే త్వరగా ప్రోగ్రెషన్ ఉంటుంది.
-
HR Trainee → HR Executive → HR Manager → HR Business Partner → HR Director
-
మీరు స్పెషలైజ్ చేసిన విభాగంలో మరింత గమనించదగిన ప్రోగ్రెషన్ ఉంటుంది.
వేతన వివరాలు (Salary Details)
హెచ్ఆర్ వేతనం అనుభవం, లొకేషన్, కంపెనీకి అనుగుణంగా మారుతుంది.
-
ఫ్రెషర్స్‌కు ₹15,000 – ₹25,000 వరకు ఉంటుంది.
-
అనుభవంతో ₹50,000 – ₹1 లక్ష/month వరకు పెరుగుతుంది.
-
టాప్ MNCs లో హెచ్ఆర్ మేనేజర్స్‌కు ₹10-20 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది.
Job Offering Sectors for HR – హెచ్ఆర్ హోదాలో ఉద్యోగాలు కల్పించే రంగాలు
IT & Technology Sectors – ఐటీ మరియు టెక్నాలజీ రంగాలు
IT మరియు టెక్నాలజీ రంగం HR ప్రొఫెషనల్స్ కు పెద్ద అవకాశం కల్పిస్తుంది. వీరు ప్రధానంగా రిక్రూట్మెంట్, ట్రైనింగ్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ మరియు ఎంప్లాయి ఎంగేజ్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు టాలెంట్ ఆక్విజిషన్ నిపుణుడు (Talent Acquisition Specialist), HR వ్యాపార భాగస్వామి (HR Business Partner), శిక్షణ మేనేజర్ (Training Manager), ఉద్యోగి భాగస్వామ్యం అధికారి (Employee Engagement Officer) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Manufacturing & Engineering Sectors మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇంజనీరింగ్ రంగాలు
మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇంజనీరింగ్ రంగ బ్లూ-కాలర్ మరియు వైట్-కాలర్ ఉద్యోగులను నిర్వహించడానికి HR ప్రొఫెషనల్స్ అవసరం. ఇందులో ముఖ్యంగా లేబర్ లాజ్, ఎంప్లాయి రిలేషన్ మరియు సేఫ్టీ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు HR మేనేజర్ (HR Manager), పరిశ్రమ సంబంధాల మేనేజర్ (Industrial Relations Manager), శిక్షణ మరియు అభివృద్ధి అధికారి (Training and Development Officer) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Banking, Financial Services & Insurance (BFSI) – బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ రంగాలు
BFSI సంస్థలు రిక్రూట్మెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, కాంప్లయన్స్, కంపెన్సేషన్ ప్లానింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో విధులు నిర్వర్తించేందుకు HR మేనేజర్ (HR Manager), వేతనాలు మరియు ప్రయోజనాల నిపుణుడు (Compensation and Benefits Specialist), శిక్షణ మరియు అభివృద్ధి మేనేజర్ (Learning and Development Manager) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Healthcare & Pharmaceuticals – హెల్త్ కేర్ మరియు ఫార్మసిటికల్స్ రంగాలు
హెల్త్‌కేర్ రంగంలో HR ప్రొఫెషనల్స్ ఆరోగ్య రంగ కార్మికుల మేనేజ్మెంట్, ట్రైనింగ్ మరియు ఎంప్లాయి వెల్బీయింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు HR ఎగ్జిక్యూటివ్ (HR Executive), శిక్షణ మరియు కాంప్లయన్స్ అధికారి (Training and Compliance Officer), ఆసుపత్రి మరియు ఆరోగ్య కేంద్రాల HR మేనేజర్ (HR Manager for Hospitals and Healthcare Centers) హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Education & Training Sectors – ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ రంగాలు
విద్యాసంస్థలు మరియు ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ లో ఫ్యాకల్టీ మరియు ఇతర సిబ్బంది మేనేజ్మెంట్, కెరీర్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వర్తించేందుకు
HR అడ్మినిస్ట్రేటర్ (HR Administrator), నియామక మేనేజర్ (Recruitment Manager), శిక్షణ మరియు అభివృద్ధి విభాగాధిపతి (Training and Development Head) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Retail & E-commerce Sector – రిటైల్ మరియు ఈ కామర్స్ రంగాలు
రిటైల్ మరియు ఈ-కామర్స్ రంగాలు రిక్రూట్మెంట్, వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ మరియు సీజనల్ రిక్రూట్మెంట్ వంటి విభాగాలలో కార్యక్రమాలు వివరించేందుకు HR ఆపరేషన్స్ నిపుణుడు (HR Operations Specialist), టాలెంట్ ఆక్విజిషన్ నిపుణుడు (Talent Acquisition Specialist), వర్క్‌ఫోర్స్ ప్లానింగ్ మేనేజర్ (Workforce Planning Manager) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Hospitality & Tourism Sector – హాస్పిటాలిటీ మరియు టూరిజం సెక్టార్
ఈ రంగంలో HR ప్రొఫెషనల్స్ స్టాఫ్ మేనేజ్మెంట్ మరియు ట్రైనింగ్ ద్వారా మంచి కస్టమర్ సర్వీస్ అందించేందుకు HR సమన్వయకర్త (HR Coordinator), శిక్షణ మేనేజర్ (Training Manager), ఉద్యోగ సంబంధాల అధికారి (Employee Relations Officer) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Startups & Small Businesses Sector – స్టార్ట్ అప్ మరియు స్మాల్ బిజినెస్ సెక్టార్స్
స్టార్టప్స్ లో డైనమిక్ రోల్స్ మరియు HR పాలిసీస్, ప్రాసెస్లను రూపకల్పన చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు HR జనరలిస్ట్ (HR Generalist), టాలెంట్ ఆక్విజిషన్ విభాగాధిపతి (Talent Acquisition Head), సంస్కృతి మరియు భాగస్వామ్యం మేనేజర్ (Culture and Engagement Manager) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Public Sector & Government Organizations – పబ్లిక్ సెక్టార్స్ మరియు గవర్నమెంట్ ఆర్గనైజేషన్
ప్రభుత్వ రంగం మరియు పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పనులను నిర్వహించడానికి HR అధికారి (HR Officer), సంక్షేమ అధికారి (Welfare Officer), పరిపాలనా మేనేజర్ (Administrative Manager) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Consulting Firms – కన్సల్టింగ్ ఫర్మ్స్
HR కన్సల్టింగ్ సంస్థలు రిక్రూట్మెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, ఎంప్లాయి ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్ వంటి కార్యక్రమాలు నివసించేందుకు
HR కన్సల్టెంట్ (HR Consultant), టాలెంట్ మేనేజ్మెంట్ నిపుణుడు (Talent Management Specialist), సంస్థా అభివృద్ధి కన్సల్టెంట్ (Organizational Development Consultant) వంటి హోదాలో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Media & Entertainment Sector – మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సెక్టార్
*ఈ రంగంలో క్రీటివ్ టాలెంట్ మేనేజ్మెంట్, కాంట్రాక్ట్స్ మరియు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వర్తించేందుకు
HR సమన్వయకర్త (HR Coordinator), టాలెంట్ మేనేజర్ (Talent Manager), ఉద్యోగ సంబంధాల నిపుణుడు (Employee Relations Specialist) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Non-Governmental Organizations (NGOs) & Non-Profits- నాన్ ప్రాఫిట్ మరియు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్
NGOs లో రిక్రూట్మెంట్, వాలంటీర్ ప్రోగ్రామ్స్ మరియు లీగల్ కంప్లయన్స్ మేనేజ్మెంట్ కు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు HR మేనేజర్ (HR Manager), వాలంటీర్ కోఆర్డినేటర్ (Volunteer Coordinator), నియామక నిపుణుడు (Recruitment Specialist) వంటి హోదాలో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Real Estate & Construction Sector – రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ సెక్టార్
ఈ రంగంలో వివిధ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులను మేనేజ్మెంట్ చేయడానికి మరియు లేబర్ ఇష్యూస్, కాంప్లయన్స్ పై కృషి చేయటం ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు HR మేనేజర్ (HR Manager), పరిశ్రమ సంబంధాల మేనేజర్ (Industrial Relations Manager), కాంప్లయన్స్ అధికారి (Compliance Officer) వంటి హోదాల్లో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Skills Required for HR Professionals – హెచ్ఆర్ ప్రొఫెషనల్ కి కావాల్సిన నైపుణ్యాలు
కమ్యూనికేషన్ స్కిల్స్ అనగా క్లియర్ మరియు ఎఫెక్టివ్ గా మాట్లాడటం,ఆర్గనైజేషన్ స్కిల్స్ అనగా మల్టిపుల్ టాస్క్స్ మరియు పీపుల్ మేనేజ్మెంట్ చేయటం,అనాలిటికల్ స్కిల్స్ అనగా వర్కింగ్ డేటా ఆధారంగా టాలెంట్ మేనేజ్మెంట్ చేయటం, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనగా ఎంప్లాయీస్ మరియు లీడర్షిప్ తో సంబంధాలు మెరుగుపరచడం,లీగల్ నాలెడ్జ్ అనగా లేబర్ లాజ్ మరియు కంప్లయన్స్ పై అవగాహన కలిగి ఉండటం, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనగా వర్క్‌ప్లేస్ సమస్యలను పరిష్కరించడం వంటి ప్రధానమైన నైపుణ్యాలను హెచ్ఆర్ ప్రొఫెషనల్ కలిగి ఉండవలెను.
Skills , Roles and Responsibilities of HR – హెచ్ఆర్ స్కిల్స్, విధులు మరియు బాధ్యతలు
HR డిపార్ట్మెంట్ సంస్థలో సమగ్రంగా పని చేస్తూ ఉద్యోగుల మరియు సంస్థ ప్రయోజనాలను కాపాడుతూ, సంస్థ అభివృద్ధి సాధనకు కీలకంగా ఉంటుంది మరియు ఉద్యోగస్తులు, సంస్థకి మధ్య వారధి లాగా పని చేస్తుంది.
Employee Recruitment – ఉద్యోగుల నియామకం
ఉద్యోగ నియామకం అనేది ప్రతి సంస్థ నందు HR డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన బాధ్యత. సంస్థ యొక్క అవసరాలను గుర్తించి అందుకు తగిన ఉద్యోగస్తులను నియమించడం కోసం అణువైన జాబ్ డిస్క్రిప్షన్ ని తయారు చేసి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయవలసి ఉంటుంది.
జాబ్ కోసం అప్లై చేసిన వారి రెజ్యూమ్ లను స్క్రీనింగ్ చేసి అర్హులైన వారిని ఇంటర్వ్యూ చేసి సంస్థకు అవసరమైన నైపుణ్యాలు మరియు అనుభవం కలిగిన వ్యక్తులను ఎంపిక చేసి వారికి ఆఫర్ లెటర్ మరియు జాయినింగ్ లెటర్ నన్ను అందించి ఉద్యోగ నియామక ప్రక్రియ నిర్వహించవలసి ఉంటుంది.
Employee Onboarding – ఉద్యోగి ప్రవేశ కార్యక్రమం
కొత్తగా నియమించబడిన ఉద్యోగులను సంస్థలోకి స్వాగతించడంతో పాటు, సంస్థలో ఉన్న ఉద్యోగులను వారికి పరిచయం చేయటం మరియు సంస్థ చేసే పని మరియు వ్యాపార ప్రక్రియలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.
Employee Training and Development – ఉద్యోగస్తుల శిక్షణ మరియు అభివృద్ధి
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి అనేక విధాలైన శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అమలు పరచడం మరియు ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.
Employee Relations – ఉద్యోగి సంబంధాలు
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంస్థలో ఉద్యోగుల మధ్య సఖ్యతను పెంపొందించటం మరియు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించటం , ఉద్యోగుల అవసరాలను, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవడం మరియు సంస్థ విధానాలు అమలులోకి తీసుకురావడం వంటి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.
Compensation and Benefits – జీతాలు మరియు ప్రయోజనాలు
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సముచితమైన జీతాలు, బోనస్‌లు, మరియు ఇతర ప్రయోజనాలు అందించి సంస్థ కోసం ఉద్యోగులు సంతృప్తి గా పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అమలుపరచవలసి ఉంటుంది.
Employee Performance Management – ఉద్యోగస్తుల పనితీరు నిర్వహణ
సంస్థ యొక్క వ్యాపార లక్ష్యాలను అందుకోవడానికి ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, వారి మెరుగుదలకు సూచనలు ఇవ్వడం, వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, రివార్డులు మరియు గుర్తింపులు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.
Compliance enforcement – నియమ నిబంధనలు అమలు పరచడం
కార్మిక చట్టాలను మరియు సంస్థ లైసెన్సింగ్ విధానాలను అనుసరించడం ద్వారా ఉద్యోగం నియమాకాలు చేయవలసి ఉంటుంది. కార్మిక చట్టాలు ఉల్లంఘన లేకుండా ఉద్యోగస్తుల పనిగంటలు మరియు జీతభత్యాలను సమగ్రవంతంగా నిర్వర్తించవలసి ఉంటుంది.
Employee Engagement – ఉద్యోగి సమగ్రత
ఉద్యోగులకు సంతోషంగా ఉండే వాతావరణాన్ని అందించడానికి కార్యక్రమాలు, సదస్సులు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. వీటి ద్వారా ఉద్యోగస్తుల పనితీరు మెరుగుపడుతుంది.
Employee Succession Planning – – ఉద్యోగి వారసత్వ ప్రణాళిక
ఉద్యోగస్తులు సంస్థ పని పట్ల చూపించే శ్రద్ధ మరియు వారి పని నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా సంస్థ లో క్రమంగా కీలకమైన స్థానాలు భర్తీ చేసే విధంగా భవిష్యత్ నాయకులను, సృజనాత్మక వ్యక్తులను గుర్తించడం మరియు వారికి ఉన్నత పదవులు కల్పించి సంస్థ అభివృద్ధికి దోహదపడడానికి సమగ్రవంతంగా పని చేయవలసి ఉంటుంది
Employee work Performance and Analytics – ఉద్యోగస్తుల పని ప్రదర్శన మరియు విశ్లేషణ
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు సంబంధించిన వర్కింగ్ డేటాను సేకరించి, వారి పని విధానాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి, తద్వారా మెరుగైన వ్యూహాలు, విధానాలను రూపొందించడం మరియు వాటిని అమలు పరచడం వంటి కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.
PRACTICE QUESTIONS TO PARTICIPATE IN MONTHLY KNOWLEDGE TEST QUIZZES – మంత్లీ నాలెడ్జ్ క్విజ్ ల నందు పాల్గొనడానికి క్రింది ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి.
1. Which specialization in MBA is relevant for HR career?
హెచ్ఆర్ కెరీర్‌కు సంబంధించి ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ అవసరం?
A) Marketing / మార్కెటింగ్
B) Finance / ఫైనాన్స్
C) Human Resource / హ్యూమన్ రిసోర్స్
D) Operations / ఆపరేషన్స్
2. What is the entry-level job role for HR graduates?
హెచ్ఆర్ గ్రాడ్యుయేట్లకు ప్రారంభ స్థాయి ఉద్యోగం ఏమిటి?
A) HR Director / హెచ్ఆర్ డైరెక్టర్
B) HR Assistant / హెచ్ఆర్ అసిస్టెంట్
C) CEO / సిఇఒ
D) Finance Officer / ఫైనాన్స్ ఆఫీసర్
3. Which exam is required for MBA admission in HR in Andhra Pradesh and Telangana?
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో హెచ్ఆర్ ఎంబీఏ అడ్మిషన్ కోసం ఏ పరీక్ష అవసరం?
A) NEET / నీట్
B) ICET / ఐసెట్
C) GATE / గేట్
D) SSC / ఎస్ఎస్సీ
4. What is the role of HR in an organization?
ఒక సంస్థలో హెచ్ఆర్ యొక్క పాత్ర ఏమిటి?
A) Manage accounts / ఖాతాలను నిర్వహించడం
B) Employee welfare and recruitment / ఉద్యోగుల సంక్షేమం మరియు నియామకం
C) Write code / కోడ్ రాయడం
D) Marketing products / ఉత్పత్తులను మార్కెట్ చేయడం
5. Which HR software is commonly used in the industry?
పరిశ్రమలో సాధారణంగా వాడే హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ఏది?
A) Tally / టల్లి
B) Photoshop / ఫోటోషాప్
C) SAP SuccessFactors / ఎస్ఏపీ సక్సెస్ఫ్యాక్టర్స్
D) AutoCAD / ఆటోక్యాడ్
ANSWERS ON ABOVE QUESTIONS – పై ప్రశ్నల సమాధానాలు
-
✅ C) Human Resource / హ్యూమన్ రిసోర్స్
-
✅ B) HR Assistant / హెచ్ఆర్ అసిస్టెంట్
-
✅ B) ICET / ఐసెట్
-
✅ B) Employee welfare and recruitment / ఉద్యోగుల సంక్షేమం మరియు నియామకం
-
✅ C) SAP SuccessFactors / ఎస్ఏపీ సక్సెస్ఫ్యాక్టర్స్
TO PRACTICE THE ANSWERS PARTICIPATE IN BELOW QUIZ – పైన ప్రశ్నల సమాధానాలు తెలుసుకోవటానికి కింది క్విజ్ నందు పాల్గొనండి
0 votes, 0 avg
0
Conclusion – ముగింపు వాక్యం
హ్యూమన్ రిసోర్సెస్ (HR) శాఖ ప్రతి సంస్థల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉద్యోగుల నియామకం నుండి వారి ఉన్నతి వరకు అన్ని అంశాల్లో HR విభాగం పని చేస్తుంది. అసిస్టెంట్ హెచ్ఆర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ రిక్రూటర్, హెచ్ఆర్ కోఆర్డినేటర్, వంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ నందు ఉద్యోగం పొంది అనుభవంతో పాటు ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ ని పెంపొందించుకుంటూ ఉంటే హెచ్ఆర్ మేనేజర్, టాలెంట్ ఎక్విజేషన్ మేనేజర్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్ మేనేజర్, కాంపెన్సేషన్ మరియు బెనిఫిట్స్ స్పెషలిస్ట్ వంటి ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చును.