వైద్య వృత్తి చాలా గౌరవప్రదమైనది మరియు ఉన్నతమైనది. వైద్య వృత్తిలో ఆసక్తి ఉన్నవారు, వైద్య రంగంలో ప్రజలకు సేవలు అందించాలి అనుకునేవారు పదవ తరగతి పూర్తి అయిన తర్వాత ఇంటర్మీడియట్ నందు సైన్స్ స్టీమ్ లో బైపీసీ (Bi.P.C)ని ఎంచుకొని నీట్ (NEET )ఎగ్జామినేషన్ నందు అర్హత సాధించి మెడికల్ కోర్సులు ఎంబిబిఎస్, బి డి ఎస్ , ఆయుష్ (MBBS , BDS, AYUSH)నందు అడ్మిషన్ పొంది గ్రాడ్యుయేషన్ పొందగలరు. తర్వాత వైద్య వృత్తిలో స్పెషలైజేషన్ కోసం ఎండి/ ఎమ్మెస్ (MD/MS)పూర్తిచేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ పొందగలరు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మెడికల్ కౌన్సిల్ (Medical Council)నందు రిజిస్టర్ అయ్యి వైద్య వృత్తిని కొనసాగించగలరు.
Step by Step Process to Become a Doctor – డాక్టర్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Complete 10+2/ Intermediate Education – 10+2 / ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేయండి
వైద్య వృత్తిలో ఆసక్తి ఉన్నవారు 10+2 (ఇంటర్మీడియట్) నందు సైన్స్ స్ట్రీమ్‌లో Bi.P.C ను ఎంచుకొని వారి విద్యను కొనసాగించవలసి ఉంటుంది ఉంటుంది, ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ (PCB) ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో కనీసం 50% మార్కులు తో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది (రిజర్వ్ కేటగిరీల వారు కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది). ఇంటర్మీడియట్ తో పాటు లేదా తర్వాత మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ (NEET) ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది.
NEET: National Eligibility cum Entrance Test – నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్
NEET ఎగ్జామినేషన్ భారతదేశంలో అన్ని వైద్య కోర్సులకు (MBBS, BDS, AYUSH – Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha, Homeopathy) ప్రవేశం పొందడానికి తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది.
NEET Exam Pattern: నీట్ ఎగ్జామ్ విధానము
NEET పరీక్షలో మొత్తం 720 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటల 20 నిమిషాలు ఉంటుంది. మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ ఉంటాయి అందులో 180 ప్రశ్నలకు సమాధానం రాయాలి.
ఫిజిక్స్ సబ్జెక్టు నందు మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి అందులో సెక్షన్ ఏ లో 35 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సెక్షన్ బి లో 15 ప్రశ్నలు ఉంటాయి అందులో తప్పనిసరిగా పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
కెమిస్ట్రీ సబ్జెక్టు నందు మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి అందులో సెక్షన్ ఏ లో 35 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సెక్షన్ బి లో 15 ప్రశ్నలు ఉంటాయి అందులో తప్పనిసరిగా పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
బోటనీ సబ్జెక్టు నందు మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి.అందులో సెక్షన్ ఏ లో 35 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సెక్షన్ బి లో 15 ప్రశ్నలు ఉంటాయి అందులో తప్పనిసరిగా పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
జువాలజీ సబ్జెక్టు నందు మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి అందులో సెక్షన్ ఏ లో 35 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సెక్షన్ బి లో 15 ప్రశ్నలు ఉంటాయి అందులో తప్పనిసరిగా పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
ప్రతి సబ్జెక్టులో 50 ప్రశ్నలు ఉన్నా 45 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. అందుకే మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది.ప్రతి సమాధానానికి +4 మార్కులు ఉంటాయి.ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కు ఉంటుంది.సమాధానం ఇవ్వని ప్రశ్నలకు మార్కులు ఉండవు.
NEET పరీక్షను రాసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవలసి ఉంటుంది.NEET పరీక్ష సాధారణంగా ఏటా ఒకసారి, దాదాపుగా మే నెలలో జరుగుతుంది.NEET నందు అర్హత సాధించడానికి, ఆ సంవత్సరానికి నిర్ణయించిన కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోరు సాధించవలసి ఉంటుంది.NEET నందు అర్హత సాధించిన వారికి మాత్రమే మెడికల్ కోర్సులు నందు ప్రవేశం కల్పించడం జరుగుతుంది.
Medical Seat Counciling Process – మెడికల్ సీట్ కౌన్సెలింగ్ ప్రాసెస్: NEET క్లియర్ చేసిన తర్వాత, రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయిలో జరిగే కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో పాల్గొనవలసి ఉంటుంది.మీ ర్యాంక్ మరియు సీట్ల లభ్యత ఆధారంగా, మీ అభిరుచికి అనుగుణంగా MBBS, BDS (Bachelor of Dental Surgery), లేదా AYUSH (BAMS – Ayurveda,BHMS – Homeopathy, BUMS – Unani, BNYS – Naturopathy, BSMS – Siddha) వంటి కోర్సులను ఎంచుకొనవచ్చును.
MBBS (Bachelor of Medicine and Bachelor of Surgery) – బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ
MBBS కోర్సు నందు సాధారణంగా 4.5 సంవత్సరాల అకాడెమిక్ అధ్యయనంతో పాటు 1 సంవత్సరం తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌తో కలిపి 5.5 సంవత్సరాలుగా ఉంటుంది.MBBS నందు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ అనేక వైద్య రంగాలు కి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉంటాయి.
BDS (Bachelor of Dental Surgery) – బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ
BDS కోర్సు సాధారణంగా 5 సంవత్సరాలుగా ఉంటుంది, దీనిలో 4 సంవత్సరాల అకాడెమిక్ అధ్యయనం మరియు 1 సంవత్సరం ఇంటర్న్‌షిప్ తో కలిపి మొత్తం ఐదు సంవత్సరాలు ఉంటుంది.
BDS నందు దంతవైద్యం (డెంటల్ సర్జరీ), ఆర్థోడాంటిక్స్, ప్రోస్తోడాంటిక్స్, పెరిఓడాంటిక్స్ వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉంటాయి.
AYUSH COURSES – ఆయుష్ కోర్సులు (BAMS, BHMS, BUMS, BNYS, BSMS)
AYUSH కోర్సులు సాధారణంగా 5.5 సంవత్సరాలుగా ఉంటాయి, ఇందులో 4.5 సంవత్సరాల అకాడెమిక్ అధ్యయనం మరియు 1 సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది.AYUSH నందు ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ, నేచురోపతి వంటి సాంప్రదాయ వైద్య రంగ కోర్సులు అందుబాటులో ఉంటాయి.
MBBS, BDS, AYUSH కోర్సులు నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ సర్టిఫికేషన్ పొందగలరు.
Register in Medical Council – మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అవ్వండి
MBBS నందు సర్టిఫికేషన్ పొందిన వారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లేదా భారత మెడికల్ కౌన్సిల్ (MCI) నందు రిజిస్టర్ అవ్వగలరు.
BDS నందు సర్టిఫికేషన్ పొందినవారు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI) నందు రిజిస్టర్ అవ్వగలరు.
AYUSH కోర్సుల నందు సర్టిఫికేషన్ పొందిన వారు AYUSH కోర్సుకు సంబంధించిన ఆయా కౌన్సిల్స్ నందు రిజిస్టర్ అవ్వగలరు.
మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయిన తర్వాత ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులుగా లేదా స్వంత హాస్పిటల్స్ , క్లినిక్స్ లను ప్రారంభించి వైద్య సేవలను అందించవచ్చును.
Specializatiion – స్పెషలైజేషన్
మెడికల్ కోర్సులు నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు స్పెషలైజేషన్ కోసం NEET-PG (MD/MS/Diploma), NEET MDS (మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ) లేదా సంబంధిత ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసి అర్హత సాధించి ఏదైనా ప్రత్యేక మెడికల్ విభాగం నందు స్పెషలైజేషన్ ను పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ను మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వా లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నందు వైద్యులుగా లేదా సొంత హాస్పిటల్స్ క్లినిక్స్ లను ప్రారంభించి వైద్య సేవలు అందించవచ్చును.
Specialization Categories – స్పెషలైజేషన్ విభాగాలు
Cardiology Department కార్డియోలాజీ విభాగము నందు స్పెషలైజేషన్ పూర్తి చేసి
కార్డియాలజిస్టుగా హృదయం మరియు రక్తనాళాల సమస్యల కు సంబంధించిన వైద్య సేవలో అందించవచ్చును.
Neurology Department : న్యూరాలజీ డిపార్ట్మెంట్ నందు
న్యూరాలజిస్టుగా మెదడు, స్పైనల్ కార్డ్ మరియు నరాల వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Orthopedics Department: ఆర్థోపెడిక్ విభాగం నందు
ఆర్థోపెడిక్ సర్జన్ గా ఎముకలు, మజ్జలు మరియు కండరాల సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Pediatrics Department: పీడియాట్రిక్స్ విభాగం నందు
పిడియాట్రిషన్ గా శిశువులు, పిల్లలు మరియు చిన్నతనంతో పాటు పెరుగుతున్న యువతరానికి సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Oncology Department: ఆంకాలజీ విభాగం నందు
ఆంకాలజిస్టు గా వివిధ రకాల క్యాన్సర్‌లను గుర్తించి దానికి సంబంధించిన వైద్య సేవలను అందించవచ్చును.
Obstetrics and Gynecology Department: గైనకాలజీ విభాగం నందు
గ్యానికాలజిస్టు/ఆబ్స్టెట్రిషన్ గా మహిళల ప్రసూతి ఆరోగ్యం, గర్భధారణ మరియు ప్రసవం కు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Dermatology Department: డేర్మటాలజీ విభాగం నందు
డెర్మటాలజిస్టు గా చర్మం, జుట్టు మరియు గోళ్ళ సంబంధిత సమస్యలకు సంబంధించిన వైద్య సేవలను అందించవచ్చును.
Endocrinology Department:
ఎండోక్రినాలజిస్టు గా హార్మోన్ల మరియు గ్రంధుల సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Gastroenterology Department: గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం నందు
గ్యాస్ట్రోఎంటరాలజిస్టుగా జీర్ణకోశం మరియు లివర్ సంబంధిత వ్యాధుల కు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Pulmonology Department: పలమనాలజీ విభాగం నందు
పల్మనాలజిస్టు గా ఊపిరితిత్తులు మరియు శ్వాస సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Ophthalmology Department: ఆప్తమాలజీ విభాగం నందు
ఆఫ్తల్మాలజిస్టు గా కంటి మరియు దృష్టి సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Psychiatry Department: సైకియాట్రీ విభాగము నందు
సైకియాట్రిస్టు గా మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Urology Department: యూరాలజీ విభాగం నందు
యూరాలజిస్టు గా మూత్ర పిండాలు మరియు పురుషుల ప్రోస్తేటు సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Nephrology Department: నెఫ్రాలజీ విభాగం నందు
నెఫ్రాలజిస్టు గా కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Rheumatology Department : రుమటాలజీ విభాగము నందు
రుమటాలజిస్టు గా ఆటోఇమ్యూన్ మరియు కీళ్ల సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Radiology Department: రేడియాలజీ విభాగం నందు
రేడియాలజిస్టు గా ఇమేజింగ్ పద్ధతుల ద్వారా వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Hematology Department: హెమటాలజీ విభాగం నందు
హీమటాలజిస్టు గా రక్త సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Otolaryngology (ENT) Department : ఈ ఎన్ టి విభాగం నందు
ఓటోలారింగాలజిస్టు/ENT స్పెషలిస్ట్ గా చెవి, ముక్కు మరియు గొంతు సంబంధిత సమస్యలకు సంబంధించిన వైద్య సేవలను అందించవచ్చును.
Anesthesiology Department: అనస్తీషియాలజీ విభాగం నందు
అనస్తీషియాలజిస్టు గా శస్త్రచికిత్స సమయంలో నొప్పి నివారణ మరియు అనస్తీషియా సమస్యలకు సంబంధించిన వైద్య సేవలను అందించవచ్చును.
General Surgery Department: జనరల్ సర్జరీ విభాగం నందు
జనరల్ సర్జన్ గా శరీరంలోని వివిధ భాగాలపై శస్త్రచికిత్సలుకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Plastic Surgery Department : ప్లాస్టిక్ సర్జరీ విభాగం నందు
ప్లాస్టిక్ సర్జన్ గా పునర్‌రచన మరియు కాస్మెటిక్ శస్త్రచికిత్సలుకు సంబంధించిన వైద్య సేవ అందించవచ్చును.
Pathology Department: పెథాలజీ విభాగం నందు
పతాలజిస్టు గా కణజాలం మరియు కణాలను పరిశీలించి వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Immunology Department: ఇమ్యునాలజీ విభాగం నందు
ఇమ్యూనాలజిస్టు గా రోగనిరోధక వ్యవస్థ సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించవచ్చును.
Emergency Medicine Department : ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం నందు
ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ గా అత్యవసర మరియు తక్షణ చికిత్స అవసరమైన పరిస్థితులలో వైద్యసేవలు అందించవచ్చును.
Super-Specialization – సూపర్-స్పెషలైజేషన్
MD/MS తరువాత DM (డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్) లేదా M.Ch. (మాస్టర్ ఆఫ్ చిరుగిరి) కోర్సులు పూర్తిచేసి వైద్యరంగం నందు సూపర్ స్పెషలైజేషన్ ను పొందవచ్చును. ఎప్పటికప్పుడు వైద్య రంగంలో తాజా అభివృద్ధులను తెలుసుకొని ఆయా వైద్య రంగాలలో స్పెషలైజేషన్ పొందవచ్చును.
Closing Sentence- ముగింపు వాక్యం
భారతదేశంలో డాక్టర్ అవ్వాలనే లక్ష్యం సాధించడానికి సుదీర్ఘమైన కృషి చేయవలసి ఉంటుంది. వైద్య వృత్తిని అభ్యసించడానికి గవర్నమెంట్ కాలేజీలు నందు పది లక్షల లోపు ప్రైవేట్ కాలేజీల నందు 50 లక్షల పైన ఖర్చు అవుతుంది. మేనేజ్మెంట్ కోటాలో వైద్య వృత్తిని అభ్యసించడానికి కోట్లలో ఖర్చు అవుతుంది. ఒక వైద్యుడిగా మారాలంటే, పదవ తరగతి తర్వాత సైన్స్ స్ట్రీమ్‌లో చదువు, ముఖ్యంగా బైపీసీ తీసుకోవడం, NEET వంటి పరీక్షలను విజయవంతంగా పూర్తిచేయడం, మెడికల్ గ్రాడ్యుయేషన్ మరియు స్పెషలైజేషన్ పూర్తి చేయడం అవసరం. మెడికల్ విద్యార్థులు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ చేసుకొని వైద్య సేవలు అందించవచ్చు. వైద్య వృత్తి ప్రజలకు సేవ చేయడంలోనే కాకుండా అత్యున్నత గౌరవం పొందటానికి ఒక గొప్ప మార్గముగా ప్రసిద్ధి చెందినది.దీనితోపాటు మెడిసిన్ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతుంటుంది కాబట్టి, నూతన వైద్య పద్ధతులు, సాంకేతికతలను నేర్చుకోవడం, కృషితో ముందుకు సాగడం ద్వారా సమాజంలో మంచి వైద్య నిపుణులుగా గుర్తింపు తెచ్చు కొనవచ్చును.
ఈ బ్లాగును పూర్తిగా చదివిన తర్వాత ఈ కింది ప్రశ్నకు సమాధానం కామెంట్ బాక్స్ లో రాసి యూనివర్సల్ నాలెడ్జ్ ఎక్సలెంట్ సర్టిఫికేట్ మరియు గోల్డ్ మెడల్ 🥇 పొందటానికి మీ ప్రయాణాన్ని కొనసాగించండి
ప్రశ్న: వైద్య వృత్తిని అభ్యసించేందుకు ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది?
- JEE
- EMCET
- NEET
- JRE