After Polytechnic Higher Education and Government Job Opportunities – పాలిటెక్నిక్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు

By Vipstudent.online

Updated On:

After Polytechnic Higher Education and Government Job Opportunities

Join WhatsApp Channel For Daily Updates

Join Now

Let’s Know About After Polytechnic Higher Education and Government Job Opportunities – పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకుందాము

పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీటెక్ బిఎస్సి బీకాం బిఎ వంటి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు , డిప్లమా టు డిగ్రీ కోర్సులు మరియు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సులు నందు వారి హైయ్యర్ ఎడ్యుకేషన్ ను కొనసాగించవచ్చును. మరియు పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ గా, టెక్నీషియన్ గా, అసిస్టెంట్ టెక్నీషియన్ గా మరియు రిలవెంట్ పోస్టుల్లో ఇండియన్ రైల్వేస్, బీహెచ్ఈఎల్, ఓఎన్జిసి, ఎన్టిపిసి, ఎస్ఎఐఎల్, స్టేట్ గవర్నమెంట్, పారా మిలిటరీ, డిఫెన్స్, ఇండియన్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ మినిస్ట్రీస్, మున్సిపల్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, నేషనల్ హైవే అథారిటీ, ఇస్రో & డి ఆర్ డి ఓ వంటి సంస్థల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుటకు అవకాశం ఉంది.

After Polytechnic Higher Education opportunities – పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్య అవకాశాలు

Bachelor of Technology (B. Tech) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బిటెక్)

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ECET) ను వ్రాసి డైరెక్టుగా బీటెక్ రెండవ సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చును. బీటెక్ నందు మెకానికలు సివిల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచ్లను ఎంచుకొనవచ్చును.

After Polytechnic Distance Education – పాలిటెక్నిక్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్

పాలిటెక్నిక్ తర్వాత ఉద్యోగం చేస్తూ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (AMIE) నందు ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ నందు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ పొందవచ్చును.

Diploma to Degree – డిప్లొమా నుండి డిగ్రీ

పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత బీఎస్సీ బిఏ బీకాం వంటి సాధన డిగ్రీ కోర్సుల నందు మరియు టెక్నాలజీ, సాఫ్ట్వేర్ కోర్సుల నందు అడ్మిషన్ పొంది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ పొందవచ్చును. యానిమేషన్ ఫ్యాషన్ టెక్నాలజీ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ వంటి ప్రత్యేకమైన రంగాల్లో ప్రొఫెషనల్ డిప్లమా కోర్సులు పూర్తి చేయవచ్చును.

After Polytechnic Certification Courses – పాలిటెక్నిక్ తర్వాత సర్టిఫికేషన్ కోర్సులు

పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ ,డేటా సైన్స్ , సిసిఎన్ఏ ,సిసిఎన్పి వంటి నెట్వర్కింగ్ కోర్సులు పైతాను, జావా వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్సుల నందు తదుపరి విద్యను కొనసాగించి సర్టిఫికేషన్స్ పొందవచ్చును.

After Polytechnic Government Job Opportunities – పాలిటెక్నిక్ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు

Indian Railways Junior Engineer – ఇండియన్ రైల్వేస్ లో జూనియర్ ఇంజనీర్

పాలిటెక్నిక్ లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ జేఈ అనే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అర్హులైన వారికి జూనియర్ ఇంజనీర్ గా ఉద్యోగ కల్పన చేస్తుంది. ఈ ఉద్యోగం నందు రైల్వే కంస్ట్రాక్షన్ పనులు, రైల్వే ట్రాక్స్ సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, మెయింటెనెన్స్ వంటి విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము ₹35,400 నుండి ₹1,12,400 వరకు ఉంటుంది.

Indian Railways Technician & ALP (Assistant Loco pilot)- ఇండియన్ రైల్వేస్ టెక్నీషియన్ & ఏ ఎల్ పి (అసిస్టెంట్ లోకో పైలట్)

పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికలు ఆటోమొబైలు డిప్లమాలు చదివిన వారికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ అండ్ ఎఎల్పి ఎగ్జామ్ నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ కల్పన చేస్తుంది. ఈ ఉద్యోగం నందు రైల్వేస్ లో లోకోమోటివ్ అసిస్టెంట్ గా, రైల్వే మిషనరీ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ వంటి విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము ₹19,900 నుండి ₹35400 వరకు ఉంటుంది.

Public Sector Undertakings – పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్

పాలిటెక్నిక్ లో డిప్లమా పూర్తి చేసిన వారు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఆపరేటర్ గా వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అర్హత సాధించి ఉద్యోగాలు పొందవచ్చును, ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము 25 వేల నుండి 60 వేల వరకు ఉంటుంది.

State Government Departments – స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్

పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసిన వారు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వ్రాత పరీక్ష నందు అర్హత సాధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ నందు అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, డ్రాప్ట్స్ మెన్, సర్వేయర్ గా ఉద్యోగాలు పొందవచ్చును. ఈ ఉద్యోగాల నందు నెలవారీ జీతము 35 వేల నుండి 60 వేల వరకు ఉద్యోగ స్థాయిని బట్టి ఉంటుంది.

Defence and Paramilitary Forces – డిఫెన్స్ అండ్ పారా మిలిటరీ ఫోర్సెస్

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా టెక్నికల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఆర్టిఫిసర్ అప్రెంటిస్, శైలర్ టెక్నికల్ కాడ్రి మరియు సి ఆర్ పి ఎఫ్, బిఎస్ఎఫ్, ఐ టి బి పి లలో ఎలక్ట్రిషన్, మెకానిక్, రేడియో ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్, మెడికల్ టెస్ట్ నందు అర్హతలు సాధించి ఉద్యోగాలు పొందవచ్చు. ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము 20వేల నుండి 50 వేల వరకు ఉంటుంది.

Staff Selection Commission Junior Engineer – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్

పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే రాత పరీక్షలందు ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ అనే రెండు విధాల పరీక్షలు రాసి అర్హత సాధించి సిపిడబ్ల్యుడి, ఎంఈఎస్, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి పలు విభాగాల నందు ఉద్యోగాలు పొందవచ్చును. ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము ₹35400 నుండి ₹1,12,400 వరకు ఉంటుంది.

Indian Government Ministries and Departments – ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్

పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ వారు రాత పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికి టెక్నీషియన్, అసిస్టెంట్, ఇంజనీర్, డ్రాప్ట్స్ మెన్, మరియు ఇతర టెక్నికల్ విభాగాల నందు ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము 25 వేల నుండి 50 వేల వరకు ఉంటుంది.

Municipal Corporations – మున్సిపల్ కార్పొరేషన్స్

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి మున్సిపల్ కార్పొరేషన్ రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూను నిర్వహించి అర్హత సాధించిన వారికి వాటర్ సప్లై, పబ్లిక్ వర్క్స్, శానిటేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాల్లో జూనియర్ ఇంజనీరు, సర్వేయరు, డ్రాప్ట్స్ మెన్ గా ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము 25వేల నుండి ₹45000 వరకు ఉంటుంది.

State Electricity Boards – స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ రాత పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జూనియర్ ఇంజనీర్, లైన్మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము 30 వేల నుండి 50 వేల వరకు ఉంటుంది.

National Highway Authority of India – నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా

పాలిటెక్నిక్ డిప్లొమా లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి నేషనల్ హైవే ఆఫ్ ఇండియా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి అర్హత సాధించిన వారికి జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము 30 వేల నుండి 45 వేల వరకు ఉంటుంది.

ISRO AND DRDO – ఇస్రో మరియు డిఆర్డిఓ

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి ఇస్రో మరియు డి ఆర్ డి ఓ రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి అర్హత పొందిన వారికి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాప్ట్స్ మెన్ గా ఉద్యోగాలను కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల నందు నెలవారి జీతము 35,400 నుండి 80 వేల వరకు ఉంటుంది.

CLOSING SENTENCE – ముగింపు వాక్యం

పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు ఉద్యోగం చేస్తూ వారి తదుపరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చును మరియు పాలిటెక్నిక్ పూర్తి చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాలి అని అనుకునేవారు వారు డిప్లమాలు పూర్తి చేసిన విభాగాల నందు పూర్తి అవగాహన కలిగి ఉండి వ్రాత పరీక్షలకు, స్కిల్ టెస్ట్ లకు ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉండవలెను. డిఫెన్స్ రంగంలో ఉద్యోగాల కోసం రాత పరీక్షలు తో పాటు ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ లుకు కూడా సిద్ధంగా ఉండవలెను.ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లను మీకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పరిశీలిస్తూ ఉండవలెను.

SHORT QUIZ ON AFTER POLYTECHNIC HIGHER EDUCATION AND GOVERNMENT JOB OPPORTUNITIES – పాలిటెక్నిక్ తరువాత ఉన్నత విద్య మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు నందు షార్ట్ క్విజ్

1. Which of the following courses can be pursued through lateral entry after completing Polytechnic?
పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా ఎలాంటి కోర్సులు చేయవచ్చు?

(a) B.Tech/ బి.టెక్

(b) B.Sc/ బి.ఎస్సీ

(c) MBA/ ఎంబీఏ

(d) M.Tech/ ఎం.టెక్
Answer: (a) B.Tech

2. What is the minimum monthly salary for Junior Engineer roles in Indian Railways?
ఇండియన్ రైల్వేస్ లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం కోసం కనిష్ట జీతం ఎంత?

(a) ₹19,900

(b) ₹25,000

(c) ₹35,400

(d) ₹45,000
Answer: (c) ₹35,400

3. Which government organizations recruit Polytechnic graduates for Technician roles?
పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్ ను టెక్నీషియన్ పోస్టులకు నియమించే సంస్థలు ఏవీ?

(a) ISRO and DRDO/ ఇస్రో మరియు డిఆర్డిఓ

(b) Reserve Bank of India/ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) Income Tax Department/ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్

(d) Indian Meteorological Department/ ఇండియన్ మెటిరోలాజికల్ డిపార్ట్మెంట్
Answer: (a) ISRO and DRDO

4. What is the eligibility exam to join as a Junior Engineer in State Government Departments?
స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో జూనియర్ ఇంజనీర్ గా చేరడానికి ఏ పరీక్ష రాయాలి?

(a) State Public Service Commission Exam/స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్

(b) SSC CGL/ఎస్ఎస్సి సిజిఎల్

(c) UGC NET/యు జి సి ఎన్ ఇ టి

(d) NDA Exam/ఎన్డీఏ ఎగ్జామ్
Answer: (a) State Public Service Commission Exam

5. Which of the following fields offers specialized certification courses after Polytechnic?
పాలిటెక్నిక్ తరువాత ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కోర్సులు అందించే రంగాలు ఏవి?

(a) Artificial Intelligence and Networking/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నెట్వర్కింగ్

(b) Agriculture/అగ్రికల్చర్

(c) Medicine/మెడిసిన్

(d) Law/లా
Answer: (a) Artificial Intelligence and Networking

Vipstudent.online

Welcome to Vipstudent.Online - The Future Of The Nation! Vipstudent.online is an exclusive career growth platform and community for students and individuals to empower themselves by enhancing their educational and professional skills and knowledge.

Leave a Comment