After Intermediate higher Education and Government Job Opportunities – ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత విద్యా మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు

By Vipstudent.online

Updated On:

After Intermediate higher Education and Government Job Opportunities

Let’s Know About After Intermediate Higher Education and Indian Government Job Opportunities – ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత విద్యా మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకుందాము.

After Intermediate Higher Education and Indian Government Job Opportunities: భారతీయ విద్యా వ్యవస్థ లో ఇంటర్మీడియట్ / 12 th గ్రేడ్ తరవాత విద్యార్ధులు వారి హయ్యర్ ఎడ్యుకేషన్ ను సైన్స్, మెడికల్,కామర్స్, ఆర్ట్స్ మరియు ఒకేషనల్ స్ట్రీమ్స్ నందు .B.Sc, B.Com, B.A, B.Tech, B.E, M.B.B.S, B.D.S, B.B.A, B.C.A , B.Pharm, LLB, B.VOC, B.Arch,B.Ed వంటి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించి యూనివర్సిటీల ద్వారా బ్యాచిలర్ డిగ్రీ ని పొందవచ్చును.ఇంటర్మీడియట్/12 th గ్రేడ్ తర్వాత ఇండియన్ రైల్వేస్ టీ సీ, లోకో పైలట్, స్టేట్ సెలక్షన్ కమిషన్ లో అటెండెంట్, ఇండియన్ ఆర్మీ ,ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ పోస్టల్ లో మాస్టర్, ఐబీపీఎస్, ఎస్బిఐ క్లర్క్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్టేట్ గవర్నమెంట్ వీఆర్వో, వీఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్, క్లర్క్, కానిస్టేబుల్, ఫారెస్ట్ రేంజరు, గార్డ్, ఫుడ్ సేఫ్టీ, ఎల్ఐసి, నాబార్డ్ వంటి అనేక ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పొందుటకు అవకాశం ఉంది.

SUCCESS IN CAREER / భవిష్యత్తు నందు విజయం : ప్రతీ విద్యార్థి వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించటానికి మరియు కెరియర్ నందు విజయవంతంగా స్థిరపడటానికి అకాడమిక్స్(Acadamics) అనగా పుస్తకాలలో ఉండే నాలెడ్జ్ తో పాటు జనరల్ స్టడీస్ (General Studies), టెక్నాలజీస్ (Technologies), హిస్టరీ (History), రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు ( International, National, State Current Affairs), వృత్తి పరమయిన స్కిల్స్ (Professional Skills), బిజినెస్ స్కిల్స్ (Business Skills), ఆర్థిక అంశాల నిర్వహణ స్కిల్స్ (Economic Management Skills), పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ (Personality Development Skills) నందు కూడా మీ జనరల్ నాలెడ్జ్ ను పెంపొందించుకొని విద్యార్థి దశ నుండే విజయం వైపు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.

After Intermediate Under Graduation programs – అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లు

Bachelor of Science – (B.Sc) – బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ స్ట్రీమ్ నందు గ్రాడ్యుయేషన్ కోర్సులు

B.Sc డిగ్రీ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సైన్స్ స్ట్రీమ్ నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు B.Sc నందు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథెమాటిక్స్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ,మైక్రో బయాలజీ, అగ్రికల్చర్, నర్సింగ్, మరియు న్యూట్రిషన్ వంటి ప్రముఖమైన కోర్సులను అభ్యసించి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ నీ పొందగలరు.

Bachilor of Arts/ Humanities (B.A)- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్/ హ్యుమానిటీస్ స్ట్రీమ్ నందు గ్రాడ్యుయేషన్ కోర్సులు

B.A డిగ్రీ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఆర్ట్స్ స్ట్రీమ్ నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు B.A నందు హిస్టరీ, పొలిటికల్ సైన్స్ , సోషియాలజీ, ఎకనామిక్స్, సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్, ఫిలాసఫీ, జియోగ్రఫీ, లాంగ్వేజెస్, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ వంటి ప్రముఖమైన కోర్సులను అభ్యసించి బ్యాచీలర్ ఆఫ్ ఆర్ట్స్/ హ్యుమానిటీస్ డిగ్రీ నీ పొందగలరు.

Bachelor of Commerce (B.Com) – బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ నందు గ్రాడ్యుయేషన్ కోర్సులు

B.Com డిగ్రీ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్.కామర్స్ స్ట్రీమ్ నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు B.Com నందు అకౌంటింగ్ & ఫైనాన్స్, బ్యాంకింగ్ & ఇన్స్యూరెన్స్ , ఎకనామిక్స్, టాక్సేషన్, బిజినస్ అనలిటిక్స్ వంటి ప్రముఖమైన కోర్సులను అభ్యసించి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీనీ పొందగలరు.

Bachilor Of Engineering (B.E)/Bachilor Of Technology (B.Tech)- బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E)/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech)

B.E/ B.Tech అనేది 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఇంజినీరింగ్ నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,మెకానికల్ ఇంజనీరింగ్,సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్,బయోటెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి కోర్సులను అభ్యసించి బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ నందు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ పొందగలరు.

Graduation In Medical And Health Care – మెడికల్ అండ్ హెల్త్ కేర్ నందు గ్రాడ్యుయేషన్

MBBS – బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అనేది ఇంటర్న్షిప్ తో కలిపి 5.5 సంవత్సరాల మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. డాక్టర్ అవ్వాలి అనే ఆసక్తి ఉన్న విద్యార్థులు వైద్య రంగంలో MBBS పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను వైద్య రంగంలో బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BDS – బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అనేది ఇంటర్న్షిప్ తో కలిపి 5 సంవత్సరాల మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్.డెంటల్ డాక్టర్ అవ్వాలి అనే ఆసక్తి ఉన్న విద్యార్థులు వైద్య రంగంలో BDS పూర్తిచేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ , బ్యాచిలర్ డిగ్రీ నీ పొందగలరు.

BAMS – బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనేది 5.5 సంవత్సరాల మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఆయుర్వేద వైద్య రంగంలో డాక్టర్ అవ్వాలి అనే ఆసక్తి ఉన్న విద్యార్థులు BAMS పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ , బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BHMS – బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనేది 5.5 సంవత్సరముల మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. వైద్య రంగంలో హోమియోపతి డాక్టర్ అవ్వాలి అనే ఆసక్తి కలిగి ఉన్న విద్యార్థులు BHMS పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BPT – బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది ఇంటర్న్షిప్ తో కలిపి 4.5 సంవత్సరాల మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. వైద్య రంగంలో ఫిజియోథెరపీ డాక్టర్ అవ్వాలి అనే ఆసక్తి ఉన్న విద్యార్థులు BPT పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

B.Sc Nursing అనేది 4 సంవత్సరాల మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. వైద్య రంగంలో నర్సు అవ్వాలి అనే ఆసక్తి ఉన్న విద్యార్థులు B.Sc నర్సింగ్ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

B.Pharm – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అనేది 4 సంవత్సరాల మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్.ఫార్మాస్యూటికల్ రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేసి మెడికల్ లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

Bachilor Of Laws (LLB) – బ్యాచిలర్ ఆఫ్ లా

న్యాయ శాస్త్రము లో ఆసక్తి ఉన్న విద్యార్థులు లా ప్రాక్టీసు చెయ్యటానికి 5 సంవత్సరాల పాటు BA LLB/ BBA LLB/ B.Com LLB వంటి కోర్సులు పూర్తి చేసి న్యాయ శాస్త్రము లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

Business and Management – బిజినెస్ అండ్ మేనేజ్మెంట్

BBA – బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. బిజినస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ రంగము నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు BBA ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను , బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BMS – బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. లీడర్షిప్ మరియు ఎంట్రాప్రెన్యూరియల్ స్కిల్స్ నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు BMS పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BHM – బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది 3 నుండి 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ రంగములో ఆసక్తి ఉన్న విద్యార్థులు BHM పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

After Intermediate Other Graduation Programmes – ఇతర ప్రముఖమైన గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లు

B.Des – బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేది 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యానిమేషన్ & మల్టీమీడియా, ప్రొడక్ట్ డిజైనింగ్ నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు B.Des లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BFA – బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది 3 నుండి 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్ నందు ఆసక్తి ఉన్న విద్యార్థులు BFA లొ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

B.Sc Agriculture అగ్రికల్చర్ అనేది 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. వ్యవసాయ రంగములో ఆసక్తి ఉన్న విద్యార్థులు B.Sc అగ్రికల్చర్ లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను , బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

B.Arch – బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది 5 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. నిర్మాణ రంగము లో ఆసక్తి ఉన్న విద్యార్థులు B.Arch లొ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను, బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BJMC – బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. జర్నలిజం లో ఆసక్తి ఉన్న విద్యార్థులు BJMC పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను , బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BPA – బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్.సంగీతం, డ్యాన్స్ మరియు థియేటర్ రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు BPA పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను , బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

BCA – బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు సాఫ్టువేర్ డెవలప్మెంట్ రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు BCA పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ను , బ్యాచిలర్స్ డిగ్రీ నీ పొందగలరు.

After Intermediate/12 th Indian Government Job Opportunities – ఇంటర్మీడియట్ 12 గ్రేడ్ తర్వాత గవర్నమెంట్ జాబ్ అవకాశాలు

After Intermediate Indian Railways Non – Technical jobs – ఇండియన్ రైల్వేస్ నాల్ టెక్నికల్ జాబ్స్

గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ / 12 గ్రేడ్ లో ఉత్తీర్ణులై 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఇండియన్ రైల్వేస్ లో నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కింద జూనియర్ క్లర్క్,అకౌంటెంట్ క్లర్క్, టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డు, జూనియర్ టైం కీపర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చును. వ్రాత పరీక్ష మరియు టైపింగ్ స్కిల్స్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగాల నందు ఎంట్రీ లెవెల్ లో నెలవారి జీతము 25 వేల నుండి 35 వేల వరకు ఉంటుంది.

After Intermediate Indian Railways Assistant Loco Pilot – ఇండియన్ రైల్వేస్ అసిస్టెంట్ లోకో పైలట్

పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఐటిఐ లేదా పాలిటెక్నిక్ ఉత్తీర్ణులై 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఇండియన్ రైల్వేస్ నందు అసిస్టెంట్ లోకో పైలట్ గా ఉద్యోగం పొందవచ్చును. స్టేజ్ వన్ లో, స్టేజి 2 లో సి బి టి వ్రాత పరీక్ష మరియు స్టేజ్ 3 లో కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హులైన వారికి ఉద్యోగ కల్పన చేస్తుంది. ఈ ఉద్యోగం నందు ఎంట్రీ లెవెల్ లో నెలవారి జీతము 19,000 నుండి 22 వేల వరకు ఉంటుంది.

After Intermediate Indian Army – ఇండియన్ ఆర్మీ

ఇంటర్మీడియట్ / 12 th గ్రేడ్ లో ఉత్తీర్ణులై 17 సంవత్సరాల ఐదు నెలల నుండి 23 సంవత్సరాల మధ్య వయసు వరకు గలవారు ఇండియన్ ఆర్మీలో జనరల్ సోల్జర్ డ్యూటీ, టెక్నికల్ సోల్జర్, క్లర్క్, ట్రేడ్స్ మెన్ వంటి ఉద్యోగాలు పొందవచ్చును. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హత పొందిన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము 20,000 నుండి 25 వేల వరకు ఉంటుంది.

After Intermediate Indian Navy – ఇండియన్ నేవీ

ఇంటర్మీడియట్ లేదా 12 th గ్రేడ్ నందు సైన్స్ స్ట్రీమ్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై 17 నుండి 20 సంవత్సరాలు మధ్య వయసు కలవారు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అండ్ ఏ ఏ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. కంప్యూటర్ బేసిక్ టెస్ట్, ఫిసికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్లు వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హత పొందిన వారు కి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగాలలో ట్రైనింగ్ నందు నెలవారి జీతం 14600 నుండి ట్రైనింగ్ తర్వాత నెలవారి జీతము 25 వేల వరకు ఉంటుంది.

After Intermediate Indian Airforce – ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఇంటర్మీడియట్ /12 th గ్రేడ్ లో (సైన్స్ స్ట్రీమ్- గ్రూప్ X) ఉత్తీర్ణులైనవారు లేదా పాలిటెక్నిక్ నందు ఉత్తీర్ణులై 17 నుండి 21 సంవత్సరాల మధ్య వయసు కలవారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ X టెక్నికల్ పోస్టులు, గ్రూప్ Y నా టెక్నికల్ పోస్టులు నందు ఉద్యోగాలు పొందవచ్చును. ఆన్లైన్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ వంటి సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం అందు నెలవారి జీతము ₹26,900 నుండి ₹33,000 వరకు ఉంటుంది.

After Intermediate Indian Postal – ఇండియన్ పోస్టల్

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , డక్ సేవక్ గా ఉద్యోగాలు పొందవచ్చును. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు ఉండవు ఇంటర్మీడియట్ లేదా టెన్త్ క్లాస్ నందు వచ్చిన మార్కులను ఆధారం చేసుకుని మెరిట్ ఉన్నవారికి మరియు అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారీ జీతము 10,000 నుండి 14,000 వరకు ఉంటుంది.

After Intermediate Indian Police Conistable Recruitment – పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు గల వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హులైన వారికి స్టేట్ లెవెల్ లో పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము 20 వేల నుండి 25 వేల వరకు ఉంటుంది.

After Intermediate IBPS & SBI Clerks – ఐబీపీఎస్ & ఎస్బిఐ క్లర్క్స్

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసుగల వారికి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హులైన వారికి ఈ బ్యాంక్స్ నందు క్లర్క్ గా ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము 23000 నుండి 30000 వరకు ఉంటుంది.

After Intermediate Indian Coast Guard – ఇండియన్ కోస్ట్ గార్డ్

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 నుండి 22 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఇండియన్ కోస్ట్ కార్డులో నావిక్ ఉద్యోగం పొందవచ్చును. స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ స్టేజి 2 లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ స్టేజి త్రీ లో మెడికల్ ఎగ్జామినేషన్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హత కలిగిన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము 21700 నుండి 29 వేల రెండు వందల వరకు ఉంటుంది.

After Intermediate State Government Recruitment – స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 సంవత్సరాలు నుండి 32 సంవత్సరాల మధ్య వయసు గల వారు స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ద్వారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. ఈ ఉద్యోగాల కొరకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ కల్పన చేస్తుంది. ఈ ఉద్యోగాల నందు నెలవారీ జీతము 18000 నుండి 30000 వరకు ఉంటుంది.

After Intermediate Public Sector Undertakings – పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు గవర్నమెంట్ కి అనుబంధ సంస్థల నందు జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు అప్రెంటిస్ గా ఉద్యోగాలు పొందవచ్చును. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగాల నందు నెలవారీ జీతము 20వేల నుండి 35వేల వరకు ఉంటుంది.

After Intermediate Indian Forrest Department – ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్

ఇంటర్మీడియట్ నందు ఉత్తర్నులై 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ రేంజర్ మరియు ఫారెస్ట్ గార్డుగా ఉద్యోగాలు పొందవచ్చును. వ్రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము 18 వేల నుండి 28 వేల వరకు ఉంటుంది.

FSSAI – Food Safty and Standards Authority of India – ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్, ఫుడ్ అనలిస్టు, జూనియర్ అసిస్టెంట్ వంటి ఎంట్రి లెవెల్ ఉద్యోగాలు పొందవచ్చును. వ్రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ప్రాసెస్ నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతం 25వేల నుండి 35000 వరకు ఉంటుంది.

ESIC, LIC – Insurence Corporation – ఇన్సూరెన్స్ కార్పొరేషన్

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసుగల వారు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నందు అసిస్టెంట్, క్లర్కు, స్టెనోగ్రాఫర్ గా ఉద్యోగాలు పొందవచ్చును. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ వంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము 21 వేల నుండి 30 వేల వరకు ఉంటుంది.

NABARD – National Bank for Agriculture and Rural Development – నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్

ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు గలవారు నాబార్డ్ నందు అసిస్టెంట్స్ గా ఉద్యోగాలు పొందవచ్చును. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ ఉద్యోగం నందు నెలవారి జీతము 28,000 నుండి 35 వేల వరకు ఉంటుంది.

PRACTICE QUESTIONS TO PARTICIPATE IN MONTHLY KNOWLEDGE TEST QUIZZES – మంత్లీ నాలెడ్జ్ క్విజ్ ల నందు పాల్గొనడానికి క్రింది ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి.

1. What is the full form of EAMCET?
EAMCET (ఈఏఎంసెట్) యొక్క పూర్తి రూపం ఏమిటి? ✅ (KT QUIZ JULY 2025 QUESTION)

  1. 1. Engineering and Agricultural Medical Combined Entrance Test
    ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చరల్ మెడికల్ కాంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్
  2. 2. Engineering and Advanced Medical Common Eligibility Test
    ఇంజినీరింగ్ మరియు అడ్వాన్స్‌డ్ మెడికల్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్
  3. 3. Engineering and Agricultural Medical Common Entrance Test
    ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చరల్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
  4. 4. Engineering and Agricultural Medicine Common Examination Test
    ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చరల్ మెడిసిన్ కామన్ ఎగ్జామినేషన్ టెస్ట్

2. Which is the correct course to pursue a degree in the Arts stream after Intermediate /12th class?
ఇంటర్మీడియట్ / 12వ తరగతి తర్వాత ఆర్ట్స్ స్ట్రీమ్ నందు డిగ్రీ పొందడానికి ఏది సరైన కోర్సు? ✅ (KT QUIZ JULY 2025 QUESTION)

  1. 1. B.Tech
  2. 2. B.Sc
  3. 3. B.A
  4. 4. B.Com

3. Identify the correct match for “Bachelor of Engineering (B.E) and Bachelor of Technology (B.Tech)”:
“బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (B.E) మరియు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech)” కోసం కరెక్ట్ మ్యాచ్‌ను గుర్తించండి: ✅ (KT QUIZ JULY 2025 QUESTION)

  1. 1. Duration: 5.5 years, Field: Medical
    సమయం: 5.5 సంవత్సరాలు, ఫీల్డ్: మెడికల్
  2. 2. Duration: 4 years, Field: Engineering
    సమయం: 4 సంవత్సరాలు, ఫీల్డ్: ఇంజినీరింగ్
  3. 3. Duration: 3 years, Field: Commerce
    సమయం: 3 సంవత్సరాలు, ఫీల్డ్: కామర్స్
  4. 4. Duration: 4 years, Field: Arts
    సమయం: 4 సంవత్సరాలు, ఫీల్డ్: ఆర్ట్స్

4. Which of the following is a Commerce stream course after 12th?
12వ తరగతి తర్వాత కామర్స్ స్ట్రీమ్‌కి చెందిన కోర్సు ఏమిటి? ✅ (KT QUIZ JULY 2025 QUESTION)

  1. B.A

  2. B.Sc

  3. B.Com

  4. B.Tech

5. Which entrance exam is required for admission into MBBS in India?
భారతదేశంలో MBBS ప్రవేశానికి అవసరమైన ప్రవేశ పరీక్ష ఏది?

  1. EAMCET

  2. JEE

  3. NEET

  4. ICET

ANSWERS ON ABOVE QUESTIONS – పై ప్రశ్నల సమాధానాలు

1). C 

2). C

3). B

4).C

5).C

PRACTICE SHORT QUIZ 3 ON AFTER INTERMEDIATE HIGHER EDUCATION AND INDIAN GOVERNMENT JOB OPPORTUNITIES
To know the Answers Participate in Below Quiz – సమాధానాలు తెలుసుకోవటానికి కింది క్విజ్ లో పాల్గొనండి.

0 votes, 0 avg
1

SHORT QUIZ 3 ON AFTER INTERMEDIATE CAREER - ఇంటర్మీడియట్ తరువాత కెరియర్

Daily Quiz to Participate in Universal Knowledge Quizzes - డైలీ క్విజ్

1 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 What is the duration of MBBS (Bachelor of Medicine and Bachelor of Surgery) including internship?
ఇంటర్న్‌షిప్‌తో కలిపి MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) కొరకు సమయం ఎంత?

2 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 Which is the correct course to pursue a degree in the Arts stream after Intermediate /12th class?
ఇంటర్మీడియట్ / 12వ తరగతి తర్వాత ఆర్ట్స్ స్ట్రీమ్ నందు డిగ్రీ పొందడానికి ఏది సరైన కోర్సు?

3 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 What is the duration of a B.Sc (Bachelor of Science) degree course?
B.Sc (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) డిగ్రీ కోర్సు యొక్క వ్యవధి ఎంత?

4 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 Which of the following is a Commerce stream course after 12th?
12వ తరగతి తర్వాత కామర్స్ స్ట్రీమ్‌కి చెందిన కోర్సు ఏమిటి?

5 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 Identify the correct match for "Bachelor of Engineering (B.E) and Bachelor of Technology (B.Tech)":
"బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (B.E) మరియు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech)" కోసం కరెక్ట్ మ్యాచ్‌ను గుర్తించండి:

6 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 Which of the following is a job opportunity after intermediate in the Indian Railways?
ఇంటర్మీడియట్ తర్వాత భారతీయ రైల్వేలో ఏది జాబ్ ఆప్షన్?

7 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 What is the minimum educational qualification required to appear for EAMCET?
EAMCET రాయడానికి కనీస విద్యార్హత ఏమిటి?

8 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 After completing B.Tech, which course is usually pursued for higher studies?
B.Tech పూర్తయిన తర్వాత ఎక్కువగా ఎలాంటి హయ్యర్ స్టడీస్ కోసం కోర్సు చేస్తారు?

9 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

 What is the full form of EAMCET?
EAMCET (ఈఏఎంసెట్) యొక్క పూర్తి రూపం ఏమిటి?

 

10 / 10

Category: SHORT QUIZ 3 AFTER INTERMEDIATE CAREER

Which entrance exam is required for admission into MBBS in India?
భారతదేశంలో MBBS ప్రవేశానికి అవసరమైన ప్రవేశ పరీక్ష ఏది?

Your score is

0%

AFTER INTERMEDIATE HIGHER EDUCATION AND INDIAN GOVERNMENT JOB OPPORTUNITIES: CONCLUSION – ముగింపు వాక్యం

భారత విద్యా వ్యవస్థ నిర్వహించే ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లు ప్రపంచ విద్యా వ్యవస్థకు పోటీ గా విద్యార్ధుల్లో సృజనాత్మకత మరియు నైపుణ్యాభివృద్ధి నీ మెరుగు పరచటానికి దోహదం చేస్తున్నాయి. గవర్నమెంటు మరియు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ కల్పనకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అనేది ప్రముఖంగా పరిగణన లోనికి తీసుకోవటం జరుగుతుంది.

సాధారణంగా ఇంటర్మీడియట్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు జనరల్ అవేర్నెస్ లో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, బేసిక్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ లో అర్థమెటిక్, ఆల్జీబ్రా, పర్సంటేజ్స్, ఎవరేజస్, రేషియోస్, రీజనింగ్ లో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ అనాలసిస్, జనరల్ ఇంగ్లీష్ లో బేసిక్ గ్రామర్, కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ వంటి అంశాలను నందు పూర్తి అవగాహనను కలిగి ఉండవలెను.

వీటితోపాటు డిఫెన్స్ రంగంలో జాబులు కోసం ప్రయత్నం చేసేవారు ఫిజికల్ ఫిట్నెస్ లో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం రన్నింగ్ , పుష్ అప్స్, ఫుల్ అప్స్, లాంగ్ జంపు, హై జంపు వంటివి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.మరియు మెడికల్ ఫిట్నెస్ లో భాగంగా విజన్, హీరింగ్, హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ మరియు టోటల్ బాడీ ఫంక్షన్నింగు క్రమబద్ధంలో ఉండేటట్లు చూసుకోవాలి.

Vipstudent.online

Welcome to Vipstudent.Online - The Future Of The Nation! Vipstudent.online is an exclusive career growth platform and community for students and individuals to empower themselves by enhancing their educational and professional skills and knowledge.

Leave a Comment