Let’s Know About After Bachelor of Degree Government Job Opportunities – బ్యాచిలర్ డిగ్రీ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకుందాం
బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన వారు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్) లో , స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , సెంట్రల్, స్టేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో, ఇండియన్ రైల్వేస్ లో, బీహెచ్ఈఎల్, ఓఎన్జిసి, జిఏఐఎల్, హెచ్పిసిఎల్ బిపిసిఎల్ లో, ఐబీపీఎస్, ఎస్బిఐ లో, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో, రెవెన్యూ , ఎక్సైజ్ , ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లలో, మెడికల్ రీసెర్చ్ లో, ఇస్రో, డి ఆర్ డి ఓ లో, అగ్రికల్చర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో, ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో, ఇండియన్ మినిస్ట్రీస్ లలో ఉద్యోగాలు పొందుటకు అవకాశం ఉంది అందులో కొన్ని ప్రముఖమైన ఉద్యోగాల గురించి తెలుసుకుందాం
After Bachelor of Degree Government Job Opportunities బ్యాచిలర్ డిగ్రీ తరవాత గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు
Staff Selection Commission Combined Graduate Level- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా గవర్నమెంట్ మినిస్ట్రీస్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ మరియు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లలో ఇన్స్పెక్టర్, సిబిఐ లో సబ్ ఇన్స్పెక్టర్ , స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ , మీటియోరోలాజికల్ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ నందు అర్హత సాధించి ఉద్యోగాలు పొందవచ్చును మరియు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ నందు అర్హత సాధించి లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను పొందవచ్చును.
Union Public Service Commission – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (After Degree)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నందు ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్ టైపు) మెయిన్స్ ఎగ్జామ్ (ఎస్సే రైటింగ్) అండ్ ఇంటర్వ్యూ ల నందు అర్హత సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) వంటి ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చును.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లో సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహించే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల నందు అర్హత సాధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ల నందు ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చును.
State Public service Commission – స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (After Degree)
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పోస్టుల కోసం నిర్వహించే ప్రీలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూల నందు అర్హత సాధించి డిప్యూటీ కలెక్టర్, డి.ఎస్.పి, మరియు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చును
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పోస్టులు కోసం నిర్వహించే రాత పరీక్ష మరియు స్క్రీనింగ్ టెస్ట్ నందు అర్హత సాధించి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సబ్ రిజిస్టార్ మరియు మున్సిపల్ కమిషనర్ వంటి ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చును.
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం నిర్వహించే రాత పరీక్షలు మరియు స్క్రీనింగ్ టెస్ట్ ల నందు అర్హత సాధించి అన్ని రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఉండే ఆఫీస్ వర్క్ మరియు లోయర్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు పొందవచ్చును.
స్టేట్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (SSC CGL)నిర్వహించే టైర్ వన్ ప్రిలిమ్స్, టైర్ టు మెయిన్స్, టైర్ త్రీ డిస్క్రిప్టివ్, టైర్ ఫోర్ స్కిల్ టెస్ట్ నందు అర్హత సాధించి ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్, మినిస్ట్రీస్ లో అసిస్టెంట్, ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ గా ఆడిటింగ్ అకౌంటింగ్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆఫీస్ వర్క్ వంటివి పలు విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చును.
After Degree Education Sector – డిగ్రీ తర్వాత విద్యా రంగము
డిగ్రీ తర్వాత డిఎడ్ (D.EI.ED)పూర్తి చేసి సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ లో టెట్ – TET (Teacher Eligibility Test) పరీక్ష నందు అర్హత సాధించి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్స్ నందు టీచర్స్ గా ఉద్యోగాలు పొందవచ్చును
డిగ్రీ తర్వాత బీఈడీ /ఎంఈడి (B.Ed/ M.Ed) పూర్తి చేసి సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ లో టెట్ – TET (Teacher Eligibility Test) పరీక్ష నందు అర్హత సాధించి ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్స్ నందు టీచర్స్ గా ఉద్యోగాలు పొందవచ్చును
డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ /ఎంఈడి (B.Ed/M.Ed) పూర్తి చేసి సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ లో టెట్ TET పరీక్ష నందు అర్హత సాధించి గవర్నమెంట్ కాలేజీల నందు లెక్చరర్స్ గా ఉద్యోగాలు పొందవచ్చును
డిగ్రీ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి (పీహెచ్డీ Ph.d చేసిన వారికి అధిక ప్రాధాన్యత) కేంద్ర స్థాయిలో నిర్వహించే ఎన్ ఈ టి (NET – National Eligibility Test) రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎస్ఇటి (SET – State Eligibility Test) పరీక్ష లందు అర్హత సాధించి గవర్నమెంట్ యూనివర్సిటీల నందు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా ఉద్యోగాలు పొందవచ్చును
Banking And Financial Sector – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సెక్టార్ (After Degree)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూలు నందు అర్హత సాధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్, క్లర్క్స్ మరియు అసిస్టెంట్ గా కస్టమర్ సపోర్టు, ఫైనాన్స్ మేనేజ్మెంట్, లోన్ ప్రాసెసింగ్, అకౌంట్ మేనేజ్మెంట్, క్యాష్ హ్యాండ్లింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ వంటి పలు విభాగాల నందు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు పొందవచ్చును.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎక్సమ్ ఇంటర్వ్యూల నందు అర్హత సాధించి గ్రేట్ బి ఆఫీసర్ మరియు అసిస్టెంట్లుగా రెగ్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పాలసీ మేనేజ్మెంట్ కరెన్సీ ఇష్యూస్ మరియు ఫైనాన్షియల్ అనాలసిస్ వంటి పలు విభాగాల్లో బ్యాంకింగ్ ఉద్యోగాలు పొందవచ్చును.
Indian Railways – ఇండియన్ రైల్వేస్ (After Degree)
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే పరీక్షలు స్టేజ్ వన్, టు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ నందు అర్హత సాధించి నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరి లో స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, జూనియర్ క్లర్క్, అకౌంటెంట్ మరియు కమర్షియల్ అప్రెంటిస్ గా, సివిల్ , మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లలో జూనియర్ ఇంజనీర్ గా, ఆర్ ఆర్ బి గ్రూప్ డి కేటగిరీలో నిర్వహించే పరీక్షలు కంప్యూటర్ బేస్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నందు అర్హత సాధించి ట్రాక్ మెయింటినర్, హెల్పర్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ గా ఉద్యోగాలు పొందవచ్చును.
Indian Deffence Services – ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ (After Degree)
ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నిర్వహించే రాత పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మెడికల్ టెస్ట్ లు నందు అర్హత సాధించి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాలలో ఉద్యోగాలు పొందవచ్చును
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించే అర్హత పరీక్షలు నందు అర్హత సాధించి అసిస్టెంట్ కమాండెంట్, నావిక్ మరియు ఇతర టెక్నికల్ రంగాల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
పారా మిలటరీ ఫోర్సెస్ లో సర్వీస్ సెక్షన్ బోర్డు నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చును.
Insurence Sector – ఇన్సూరెన్స్ సెక్టార్ (After Degree)
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యెన్ ఐ సి ఎల్ ఎన్ఐఏసీఎల్ యు ఐ ఐ సి నిర్వహించే పరీక్షలు ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ ల నందు అర్హత సాధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ గా ఇన్సూరెన్స్ సేల్స్ కస్టమర్ సపోర్టు అకౌంట్ మేనేజ్మెంట్ పాలసీ మేనేజ్మెంట్ క్లెయిమ్స్ హ్యాండ్లింగ్ వంటి పలు విభాగాల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Income Tax and Customs – ఇన్కమ్ టాక్స్ అండ్ కస్టమ్స్ (After Degree)
స్టేట్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే టైర్ వన్ టైర్ టు టైర్ త్రీ పరీక్షలు నందు అర్హత సాధించి టాక్స్ ఇన్స్పెక్టర్ కష్టమ్స్ ఆఫీసర్ టాక్స్ అసిస్టెంట్ గా టాక్స్ అసెస్మెంట్ రెవెన్యూ కలెక్షన్ కష్టమ్స్ డ్యూటీ రెగ్యులేషన్ వంటి పలు విభాగాల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Police Department – పోలీస్ డిపార్ట్మెంట్ (After Degree)
స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే రాత పరీక్ష ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఇంటర్వ్యూల నందు అర్హత సాధించి సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గా లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వంటి పలు విభాగాలు నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Revenue Department – రెవెన్యూ డిపార్ట్మెంట్ (After Degree)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి రెవెన్యూ ఆఫీసర్ తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ ల్యాండ్ రికార్డ్ ఆఫీసర్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పలు విభాగాల నందు ఉద్యోగాలు పొందవచ్చును
Excise Department – ఎక్సైజ్ డిపార్ట్మెంట్ (After Degree)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ టాక్స్ అసిస్టెంట్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పలు విభాగాల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Endowment Department – ఎండోమెంట్ డిపార్ట్మెంట్ (After Degree)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ గ్రేడ్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ లీగల్ అడ్వైజర్ సూపర్డెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నందు పలు విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చును.
Public Sector Undertakings – పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ (After Degree)
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జిసి, గ్యాస్ అథర్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జి ఏ ఐ ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిహెచ్ఇఎల్, స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా ఎస్ ఏ ఐ ఎల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్ టి పి సి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ ఏ ఎల్, వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉద్యోగ స్థాయిని బట్టి అర్హత పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలలో ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Medical and Health Care Sector – మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగాలు (After Degree)
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా స్టాఫ్ నర్స్, మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాల కొరకు పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికి ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి లో ఆఫీసర్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల కొరకు పరీక్షలు నిర్వహించి అర్హత కలిగిన వారికి ఉద్యోగ కల్పన చెయ్యటం జరుగుతుంది. స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్లలో పబ్లిక్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికి హెల్త్ ఇన్స్పెక్టర్ గా మరియు ఇతర ఆరోగ్య సంబంధిత విభాగాల నందు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది.
Scientific and Research Organisation – సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (After Degree)
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లో సైంటిఫిక్ అండ్ టెక్నికల్ స్టాఫ్ కోసం, డిఫెన్స్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డి ఆర్ డి ఓ లో జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు టెక్నికల్ అసిస్టెంట్ కోసం, బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ బి ఏ ఆర్ సి లో సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ ఆఫీసర్స్ కోసం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐ సి ఎం ఆర్ లో రీసెర్చ్ ఓరియెంటెడ్ జాబ్స్ కోసం పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
Fisheries and Agriculture Sector – ఫిషరీస్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ (After Degree)
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఇతర వ్యవసాయ సంబంధిత పోస్టుల కోసం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్ మరియు సంబంధిత ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు కల్పన చేయడం జరుగుతుంది.
Indian Postal Department – ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ (After Degree)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ , కంబైన్డ్ హైయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి పోస్టల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ పోస్ట్ మాస్టర్ కాద్రి, మెయిల్ గార్డ్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్ ఏ ఆఫీసర్, పోస్టల్ ఎకౌంటు ఆఫీసర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రామీణ డక్ సేవక్ ఆఫీసర్ గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పలు విభాగాలు ఉద్యోగాలు పొందవచ్చును.
After Degree Governament Compitative Exam preparation Subjects – గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అవగాహన అంశాలు
General Studies (సామాన్య అధ్యయనాలు):
భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, భౌగోళికం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మరియు దేశవ్యాప్తంగా ఉన్న సమకాలీన కరెంట్ అఫైర్స్ నందు అవగాహన కలిగి ఉండాలి.
Quantitative Aptitude (సంఖ్యాశాస్త్రం):
శాతం, గణాంకాలు, లాభనష్టం, సింపుల్ అండ్ కంపౌండ్ ఇంటరెస్ట్, సమీకరణాలు, నంబర్ సిస్టమ్, లాభాలు మరియు నష్టాలు, స్యిలబస్‌లకు సంబంధించిన ఇతర అంశాలు నందు అవగాహన కలిగి ఉండాలి.
Reasoning Ability (తర్కశక్తి):
లాజికల్ రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, క్లోక్ అండ్ కేలెండర్, కాంప్లెక్స అనాలజీ, సిల్లజిజమ్ మరియు ఇతర రీజనింగ్ కాన్సెప్ట్స్ నందు అవగాహన కలిగి ఉండాలి.
English Language (ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం):
వ్యాకరణం, రీడింగ్ కంప్రిహెన్షన్, వాక్య నిర్మాణం, అన్వయము, పొరపాట్లు సరిచేయడం, వ్యాసం మరియు పత్రలేఖనం కమిటీ అంశాల నందు అవగాహన కలిగి ఉండాలి.
General Awareness (సామాన్య అవగాహన):
జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు, ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ అవగాహన (బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం), మరియు కరెంట్ అఫైర్స్ వంటి అంశాల నందు అవగాహన కలిగి ఉండాలి.
Computer Knowledge (కంప్యూటర్ పరిజ్ఞానం):
కంప్యూటర్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ అవగాహన (చాలా ప్రభుత్వ పరీక్షల కోసం ఈ సబ్జెక్ట్ అవసరం ఉంటుంది) వంటి అంశాల నందు అవగాహన కలిగి ఉండాలి.
Closing Sentence – ముగింపు వాక్యం
బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ తరువాత గవర్నమెంట్ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందడానికి ఎప్పటికప్పుడు ఆ సంస్థల నుండి లేదా వివిధ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం గవర్నమెంట్ విడుదల చేసే నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లను తరచుగా వెరిఫై చేస్తూ ఉండవలెను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు సమగ్రమైన ప్రణాళిక, ధైర్యం, క్రమశిక్షణ, మరియు నిరంతర అభ్యాసం చాలా అవసరం. ప్రతిరోజూ నిర్దిష్ట సమయాన్ని మీ ప్రిపరేషన్ కోసం కేటాయించుకోవడం, రివిజన్ ద్వారా మీ బలహీనతలను గుర్తించి మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. యూ-ట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ కోచింగ్ క్లాసులు, ఆఫ్లైన్ కోచింగ్ క్లాసులు, మాక్ టెస్ట్‌లు మరియు ప్రశ్నపత్రాల పరిశీలన వల్ల మీరు మరింత సమగ్రంగా సి.ద్ధం కావచ్చును.మంచి ప్రణాళికతో పట్టు విడవకుండా ముందుకు సాగితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చును.
SHORT QUIZ ON AFTER BACHELOR OF DEGREE GOVERNMENT JOB OPPORTUNITIES – బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు నాలెడ్జ్ నందు క్విజ్
1. Which organization conducts the Combined Graduate Level Examination for various government ministries?
ఎలాంటి సంస్థ వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహిస్తుంది?
A. Union Public Service Commission/యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
B. Staff Selection Commission/స్టాఫ్ సెలక్షన్ కమిషన్
C. Reserve Bank of India/రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
D. Indian Space Research Organization/ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
Answer: B. Staff Selection Commission
2. What is the highest post one can achieve through the State Public Service Commission Group 1 exams?
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల ద్వారా పొందగలిగే అత్యున్నత స్థాయి పోస్టు ఏమిటి?
A. Deputy Collector/డిప్యూటీ కలెక్టర్
B. Revenue Inspector/రెవెన్యూ ఇన్స్పెక్టర్
C. Assistant Commercial Tax Officer/అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
D. Junior Clerk/జూనియర్ క్లర్క్
Answer: A. Deputy Collector
3. Which examination is required to join as an officer in the Indian Defence Services?
ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో ఆఫీసర్‌గా చేరేందుకు ఏ పరీక్ష అవసరం?
A. Combined Defence Services Examination/కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
B. Combined Graduate Level Examination/కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్
C. Banking Exams/బ్యాంకింగ్ ఎగ్జామ్స్
D. Indian Postal Services Examination/ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
Answer: A. Combined Defence Services Examination
4.What is the primary eligibility criterion for jobs in Public Sector Undertakings (PSUs) like ONGC and BHEL?
ఓఎన్జిసి మరియు బిహెచ్ఇఎల్ వంటి పిఎస్‌యులలో ఉద్యోగాలకు ప్రధాన అర్హత ప్రమాణం ఏమిటి?
A. Graduation Degree /గ్రాడ్యుయేషన్ డిగ్రీ
B. National Defence Academy Certificate/నేషనల్ డిఫెన్స్ అకాడమీ సర్టిఫికేట్
C. Diploma in Agriculture/డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
D. Computer Knowledge Certification/కంప్యూటర్ నాలెడ్జి సర్టిఫికేషన్
Answer: A. Graduation Degree
5. What is the main subject focus for General Studies in competitive exams?
కాంపిటేటివ్ పరీక్షల్లో జనరల్ స్టడీస్ ముఖ్యమైన అంశం ఏమిటి?
A) Computer Basics/కంప్యూటర్ బేసిక్స్
B) Indian History, Geography, Constitution, and Current Affairs/ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, కాన్స్టిట్యూషన్ మరియు కరెంట్ అఫైర్స్
C) Logical Reasoning/లాజికల్ రీజనింగ్
D) Quantitative Aptitude/క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్
Answer: B) Indian History, Geography, Constitution, and Current Affairs