Let’s Know About After Bachelor of Technology (B.Tech) Government Job Opportunities – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బిటెక్ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు గురించి తెలుసుకుందాము
బ్యాచ్లర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ , ఇండియన్ రైల్వేస్, డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, బ్యాంకింగ్ సెక్టార్, రీసెర్చ్ సెక్టార్, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, టెలి కమ్యూనికేషన్ సెక్టార్, సివిల్ సర్వీసెస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్, ఏరోస్పేస్ సెక్టార్, పవర్ సెక్టార్, కమ్యూనికేషన్ మరియు ఐటీ సెక్టార్, అగ్రికల్చర్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అటామిక్ ఎనర్జీ సెక్టార్, మున్సిపల్ కార్పొరేషన్, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి పలు ప్రభుత్వ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చును. బీటెక్ పూర్తి చేసిన తర్వాత “గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్” (GATE) పరీక్ష రాసి అందులో వచ్చిన స్కోర్ ఆధారంగా M.Tech నందు అడ్మిషన్ పొందవచ్చును మరియు చాలావరకు గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు వచ్చిన గేట్ స్కోర్ ను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది.
Public Sector Undertakings – పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ (PSUs)
NTPC, ONGC, BHEL, GAIL, HPCL, BPCL, IOCL వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలు ప్రధానంగా GATE స్కోర్ ఆధారంగా, కొన్నిసార్లు రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఇంజనీర్, మరియు జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టుల నందు ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
After B.Tech Indian railways – ఇండియన్ రైల్వేస్
ఇండియన్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) బీటెక్ పూర్తి చేసిన వారికి RRB JE (జూనియర్ ఇంజనీర్) మరియు RRB SSE (సీనియర్ సెక్షన్ ఇంజనీర్) వంటి పరీక్షలు నిర్వహించి సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, మరియు టెక్నికల్ సూపర్వైజర్ వంటి పోస్టుల నందు ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది.
After B.Tech Defence Services – రక్షణ సేవలు
B.Tech నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించే CDS, AFCAT, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) లేదా SSC టెక్నికల్ పరీక్షల నందు అర్హత సాధించి టెక్నికల్ ఆఫీసర్, ఇంజనీరింగ్ క్యాడర్, ఏరోనాటికల్ ఇంజనీర్, మరియు సబ్-లెఫ్టినెంట్ వంటి పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
After B.Tech Indian Engineering Services – ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (IES)
UPSC నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) నందు అర్హత సాధించి రైల్వేస్, CPWD, మరియు PWD వంటి ప్రభుత్వ విభాగాలలో ఇంజనీర్లు గా ఉద్యోగాలు పొందవచ్చును.
After B.Tech Banking Sector – బ్యాంకింగ్ సెక్టార్
SBI, RBI, మరియు IBPS వంటి బ్యాంకులు IT మరియు స్పెషలిస్ట్ రోల్స్ కోసం IBPS మరియు బ్యాంక్ లు నిర్వహించే పరీక్షల నందు అర్హత సాధించి IT ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పోస్టులు నందు ఉద్యోగాలు పొందవచ్చును.
ISRO DRDO and other Research Organisations – ISRO, DRDO మరియు ఇతర పరిశోధన సంస్థలు
ISRO, DRDO, BARC వంటి పరిశోధన సంస్థలు నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి సైంటిస్ట్/ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నందు ఉద్యోగాలకు వచ్చును.
After B.Tech State Public Works and Electricity Board – రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ మరియు ఎలక్ట్రిసిటీ బోర్డ్స్
రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ మరియు ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఇంజనీరింగ్ పోస్టుల కోసం నిర్వహించే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్షల నందు అర్హత సాధించి అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టులు నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Ater B.Tech Teaching and lecturership – టీచింగ్ మరియు లెక్చరర్‌షిప్
B.Tech నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలలో మరియు పాలిటెక్నిక్ సంస్థల్లో ఉద్యోగుల కోసం NET నందు అర్హత సాధించి లేదా GATE స్కోర్ ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ వంటి పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
After B.Tech Telecommunication Sector – టెలికమ్యూనికేషన్ సెక్టార్
BSNL మరియు ఇతర టెలికం సంస్థలు నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి జూనియర్ టెలికం ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు నందు ఉద్యోగాలు పొందవచ్చును.
After B.Tech Civil Services and Administrative Departments – సివిల్ సర్వీసెస్ మరియు పరిపాలనా విభాగాలు
B.Tech నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు UPSC మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) నిర్వహించే పరీక్షల నందు అర్హత సాధించి IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్), IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్), IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) మరియు వివిధ గ్రూప్ B మరియు గ్రూప్ C వంటి పరిపాలన విభాగంలోని పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Indian Space Research and Aerospace Sector – ఇండియన్ స్పేస్ రిసెర్చ్ మరియు ఏరోస్పేస్ సెక్టార్
ISRO, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్ (NAL) వంటి సంస్థలు నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి ఎయిర్ స్పేస్ ఇంజనీర్, ఏవియోనిక్స్ ఇంజనీర్, సిస్టమ్స్ ఇంజనీర్స్ వంటి పోస్టులు నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Power Sector (electricity boards and power corporations) – పవర్ సెక్టార్ (ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ మరియు పవర్ కార్పొరేషన్స్)
NTPC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, NHPC మరియు వివిధ రాష్ట్ర పవర్ కార్పొరేషన్స్ నిర్వహించే రాష్ట్ర స్థాయి పరీక్షల నందు అర్హత సాధించి కదా గేట్ స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అసిస్టెంట్ ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ ఫీల్ సూపర్వైజర్ వంటి పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Communication and IT Ministry Department – కమ్యూనికేషన్ మరియు IT మంత్రిత్వ శాఖ
టెక్నికల్ మరియు IT సంబంధిత పోస్టుల కోసం NIELIT నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి లేదా GATE స్కోర్ ఆధారంగా IT ఆఫీసర్, అసిస్టెంట్ నెట్వర్కింగ్ ఇంజనీర్ మరియు సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి పోస్టల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
BORDER ROAD ORGANISATION – బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)
ప్రత్యేక రోడ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌లకు ఇంజనీర్ల నియామకం కోసం
BRO నిర్వహించే రాత పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు మరియు ఫిజికల్ టెస్ట్ ల నందు అర్హత సాధించి ఇంజనీరు, సూపర్వైజర్, టెక్నికల్ ఆఫీసర్ వంటి పోస్టులు నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Agriculture and Irrigation Department – వ్యవసాయ మరియు ఇరిగేషన్ విభాగం
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వంటి శాఖలు కోసం ఇంజనీర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే PSC పరీక్షలు మరియు కొన్ని కేంద్ర స్థాయి పరీక్షలు నందు అర్హతరించి అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్
జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ మరియు ప్రాజెక్టు ఇంజనీర్ వంటి పోస్టులు నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Atomic Energy Sector – అటామిక్ ఎనర్జీ సెక్టార్
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వంటి సంస్థలు నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి లేదా గేట్ స్కోర్ ఆధారంగా సైంటిఫిక్ ఆఫీసర్, ఇంజనీర్, రీసెర్చ్ అసిస్టెంట్ వంటి పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Municipal Corporation Engineering Services – మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్
రాష్ట్ర PSC నిర్వహించే మునిసిపల్ కార్పొరేషన్ పరీక్షలు నందు అర్హత సాధించి మున్సిపల్ ఇంజనీర్ వాటర్ సప్లై ఇంజనీర్ మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజనీర్ వంటి పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Road Transport and Highways Department – రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మరియు హైవేస్ డిపార్ట్‌మెంట్
సివిల్ మరియు హైవే ఇంజనీరింగ్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ వర్క్స్ పరీక్షల నందు అర్హత సాధించి సివిల్ ఇంజనీరు మరియు హైవే ఇంజనీర్ వంటి పోస్టల్ నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Forest and Environmental Department – ఫారెస్ట్ మరియు పర్యావరణ శాఖలు
పర్యావరణ పరిరక్షణ మరియు ఫారెస్ట్ ప్రాంతాల్లో ఇంజనీర్లు కోసం రాష్ట్ర PSC నిర్వహించే పరీక్షలు మరియు ఇతర కేంద్ర స్థాయి పరీక్షలు నందు అర్హత సాధించి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ వంటి పోస్టల్ నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Airport Authority of India – ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)
జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వంటి పోస్టుల నియామకం కోసం ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా AAI నిర్వహిపొందవచ్చునుక పరీక్షలు నందు అర్హత సాధించి ఉద్యోగాలు పొందవచ్చును.
National Highways Authority of India – నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)
ప్రాజెక్ట్ ఇంజనీర్ , సైట్ ఇంజనీర్ వంటి పోస్టుల కోసం నేషనల్ హైవే అధర్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి మరియు కొన్నిసార్లు GATE స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు పొందవచ్చును.
Public Health Engineering Department – పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ (PHED)
పబ్లిక్ వాటర్ మేనేజ్‌మెంట్ మరియు సంబంధిత ప్రాజెక్టుల కొరకు రాష్ట్ర పి ఎస్ సి నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి వాటర్ రిసోర్స్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ వడ్డీ పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
National Informatics Centre – నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)
సైంటిస్టు టెక్నికల్ అసిస్టెంట్ మరియు సాఫ్ట్వేర్ ల నియామకం కోసం NIELIT నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Central Public Sector Banks – సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (టెక్నికల్ మరియు IT రోల్స్)
IBPS నిర్వహించే స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షలు నందు వరసలు సాధించి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు నందు ఐటి ఆఫీసర్ మరియు డేటా సైంటిస్ట్ వంటి పోస్టుల నందు ఉద్యోగాలు పొందవచ్చును.
Forensic and Cyber Crime Department – ఫోరెన్సిక్ మరియు సైబర్ క్రైమ్ విభాగం
సైబర్ ఫోరెన్సిక్ ఎనలిస్ట్ మరియు ఐటి ఆఫీసర్ వంటి పోస్టుల నందు నియామకం కోసం ఫోరెన్సిక్ మరియు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నిర్వహించే పరీక్షలు నందు అర్హత సాధించి ఉద్యోగాలు పొందవచ్చును.
INDIAN MATEROLOGICAL DEPARTMENT – ఇండియన్ మెటీరాలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD)
సైంటిస్టు మరియు ఐటి ఆఫీసర్ వంటి పోస్టుల కోసం ఇండియన్ మెటీరాలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) నిర్వహించే ప్రత్యేకమైన పరీక్షలు నందు అర్హత సాధించి ఉద్యోగాలు పొందవచ్చును
SURVEY OF INDIA – సర్వే ఆఫ్ ఇండియా
సర్వేయర్ మరియు ఇంజనీర్ పోస్టుల నియామకం కోసం సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించే ప్రత్యేకమైన పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ల నందు అర్హత సాధించి ఉద్యోగాలు పొందవచ్చును
COAST GUARD AND MARITIME SERVICES – కోస్ట్ గార్డ్ మరియు మెరిటైమ్ సర్వీసెస్
టెక్నికల్ ఆఫీసర్ మరియు ఇంజనీర్ వంటి పోస్టులు నియామకం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించే ప్రత్యేకమైన పరీక్షలు నందు అర్హత సాధించి ఉద్యోగాలు పొందవచ్చును
Closing Sentence – ముగింపు వాక్యం
B.Tech బీటెక్ నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ విభాగాలతో పాటు తమ స్పెషలైజేషన్ ఆధారంగా అనేక గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలను అన్వేషించవచ్చు. ప్రతి విభాగం ప్రత్యేకమైన పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ప్రాక్టికల్ టెస్టుల ఆధారంగా ఉద్యోగ కల్పన చేయటం జరుగుతుంది. బీటెక్ నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆ యా ప్రభుత్వ సంబంధిత సంస్థలు ప్రకటించే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎప్పటికప్పుడు సంబంధిత వెబ్సైట్లను సందర్శిస్తూ పరీక్షలు రాసే విధానాన్ని ప్రాక్టీస్ చేస్తూ సంసిద్ధంగా ఉండవలెను.
SHORT QUIZ ON AFTER BACHILOR OF TECHNOLOGY (B.TECH) GOVERNMENT JOB OPPORTUNITIES – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బిటెక్ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు నాలెడ్జ్ నందు షార్ట్ క్విజ్
1. Which exam score is primarily used for recruitment in Public Sector Undertakings (PSUs)?
(ప్రభుత్వ అనుబంధ సంస్థలలో (PSUs) ఉద్యోగ నియామకం కోసం ప్రధానంగా ఏ పరీక్ష స్కోర్‌ను ఉపయోగిస్తారు?)
A. SSC
B. GATE
C. IBPS
D. CDS
Answer: B. GATE
2. What is the role offered in Indian Railways after clearing the RRB JE exam?
(RRB JE పరీక్ష ఉత్తీర్ణత పొందిన తర్వాత ఇండియన్ రైల్వేస్‌లో ఏ రోల్ ఆఫర్ చేయబడుతుంది?)
A. Senior Engineer
B. Junior Engineer
C. Technical Supervisor
D. Project Engineer
Answer: B. Junior Engineer
3. Which organization conducts exams for recruiting scientists and technical assistants?
(సైంటిస్టులు మరియు టెక్నికల్ అసిస్టెంట్స్‌ను నియమించడానికి ఏ సంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది?)
A. ISRO
B. BHEL
C. DRDO
D. Both A and C
Answer: D. Both A and C
4. For a career in Civil Services, which of the following exams should a B.Tech graduate prepare for?
(సివిల్ సర్వీసెస్‌లో కెరీర్ కోసం బీటెక్ గ్రాడ్యుయేట్ ఏ పరీక్షకు సిద్ధమవ్వాలి?)
A. GATE
B. AFCAT
C. UPSC
D. IBPS
Answer: C. UPSC
5. Which sector recruits for roles like Junior Telecom Officer and Technical Assistant?
(జూనియర్ టెలికాం ఆఫీసర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టుల కోసం ఏ రంగం నియామకాలు చేస్తుంది?)
A. Banking Sector
B. Telecommunication Sector
C. Power Sector
D. Aerospace Sector
Answer: B. Telecommunication Sector