After 10th Class Higher Education and Government Job Opportunities – 10 వ తరగతి తర్వాత ఉన్నత విధ్య మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు

By Vipstudent.online

Updated On:

After 10th Class Higher Education

Join WhatsApp Channel For Daily Updates

Join Now

Let’s Know About After 10th Class Higher Education and Government Job Opportunities – 10 వ తరగతి తర్వాత ఉన్నత విధ్య మరియు గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు

10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ నందు ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఇసి, హెచ్ఇసి వంటి కోర్సులతో పాటు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లమా, ఐటిఐ, పారామెడికల్ మరియు వివిధ రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.పదవ తరగతి తర్వాత రైల్వే , స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జి డి కానిస్టేబుల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఇండియన్ పోస్టల్ సర్విసెస్ , బ్యాంకింగ్ & స్టేట్ గవర్నమెంట్ ఎంట్రీ లెవెల్ జాబులు, పారా మిలిటరీ , బి ఎస్ ఎఫ్, సి ఐ ఎస్ ఎఫ్ వంటి అనేక ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పొందుటకు అవకాశం ఉంది.

After 10th Class Higher Education Opportunities – 10వ తరగతి తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు

భారతదేశంలో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ప్రతి విద్యార్థి వారి భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్య (హైయర్ ఎడ్యుకేషన్ )లేదా వృత్తి విద్య (ఒకేషనల్ ఎడ్యుకేషన్ )లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. ఈ దశలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తు ను ప్రభావితం చేస్తాయి. ప్రతి విద్యార్థి తన యొక్క వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాలు, సబ్జెక్టుల నందు ఉన్న నాలెడ్జ్, అభిరుచులను గుర్తించి భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ పిల్లల యెుక్క ఆసక్తులను గమనించి వారికి తగ్గ సలహాలు సూచనలు ఇస్తూ వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి.

విద్యార్థులు తమ ఆసక్తులు మరియు భవిష్యత్తు లక్ష్యాల ఆధారంగా సైన్సు, ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్ మరియు ఒకేషనల్ విద్యా రంగాలలో వివిధ మార్గాలను ఎంచుకోవచ్చును. అందులో ప్రముఖమైనవి

* ఇంటర్మీడియట్ కోర్సు

* ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు పాలిటెక్నిక్

* నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు

* ఒకేషనల్ ఐ.టి.ఐ కోర్సులు

* ఒకేషనల్ పారామెడికల్ కోర్సులు

* NSDC – స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు

Intermediate Education Courses (11th, 12th Grade) – ఇంటర్మీడియట్ విద్య కోర్సులు (11, 12 వ తరగతులు) (After 10th Class)

కాల వ్యవధి : రెండు సంవత్సరాలు

Intermediate Education – M.P.C – ఇంటర్మీడియట్

ఇంజనీరింగ్ లేదా శాస్త్రీయ పరిశోధన వైపు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ నందు M.P.C స్ట్రీమ్ ను ఎంచుకోవచ్చు.

Subjects in M.P.C – సబ్జెక్టులు

  • మాథెమాటిక్స్ A & B
  • ఫిజిక్స్
  • కెమిస్ట్రీ
  •  ఫస్ట్ లాంగ్వేజ్
  • సెకండ్ లాంగ్వేజ్

After M.P.C Entrance Exams and Higher Education – M.P.C తర్వాత ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మరియు ఉన్నత చదువులు

EAMCET, JEE Main, JEE Advanced, BITSAT, VITEEE, SRMJEEE వంటి పోటీ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్‌లో B.Tech/ B.E : కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి విభాగాల్లో ప్రవేశం ప్రవేశం పొందవచ్చును మరియు NATA పరీక్ష ద్వారా ఆర్కిటెక్చర్, మర్చంట్ నేవీ (బి.టెక్ మెరైన్ ఇంజనీరింగ్), లేదా అకాడమిక్ మార్కుల ఆదారముగా B.Sc గ్రాడ్యుయేషన్ చెయ్యవచ్చును

Intermediate Education – Bi.P.C – ఇంటర్మీడియట్

వైద్య రంగాలు లేదా జీవశాస్త్రాలు వైపు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ నందు బైపిసి స్ట్రీమ్ ను ఎంచుకొనవచ్చును.

Subjects in Bi.P.C – సబ్జెక్టులు

  • బోటనీ
  • జూవాలజీ
  • ఫిజిక్స్
  • కెమిస్ట్రీ
  • ఫస్ట్ లాంగ్వేజ్
  • సెకండ్ లాంగ్వేజ్

After Bi.P.C entrance exams and Higher Education – Bi.P.C తర్వాత ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మరియు ఉన్నత విద్య:

NEET లేదా EAMCET వంటి ప్రవేశ పరీక్షల ద్వారా వైద్య కోర్సులు: MBBS, BDS, B.Pharmacy, నందు ప్రవేశము పొందవచ్చును. మరియు వ్యవసాయం కోర్సులు అగ్రికల్చర్ B.Sc , పశు వైద్య శాస్త్రం, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ నందు ప్రవేశము పొందవచ్చును.మరియు అకాడమిక్ మార్కులు ఆదారముగా అనుబంధ ఆరోగ్య కోర్సులు B.Sc నర్సింగ్, B.Sc ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియాలజీ మొదలైన కోర్సులు లో ప్రవేశము పొందవచ్చును.

Intermediate Education – C.E.C- ఇంటర్మీడియట్

వ్యాపార నిర్వహణ, బ్యాంకింగ్, లేదా లా వంటి రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ నందు సి ఈ సి స్ట్రీమ్ ను ఎంచుకోనవచ్చును

Subjects in C.E.C – సబ్జెక్టులు

  • కామర్స్
  • ఎకనామిక్స్
  • సివిక్స్
  • ఫస్ట్ లాంగ్వేజ్
  • సెకండ్ లాంగ్వేజ్

After C.E.C higher Education – C.E.C తర్వాత ఉన్నత విద్య

C.E.C పూర్తి చేసిన తర్వాత B.Com, B.B.A, B.B.M వంటి కామర్స్ & మేనేజ్మెంట్ కోర్సులు నందు ప్రవేశం పొందవచ్చును.CLAT పరీక్ష ద్వారా BA LLB లేదా B.Com LLB వంటి కోర్సులకు ప్రవేశం పొందవచ్చును. చార్టెడ్ అకౌంటెన్సీ ఫౌండేషన్ పరీక్ష తర్వాత CA కోర్సులో ప్రవేశం పొందవచ్చును.

Intermediate Education -M.E.C – ఇంటర్మీడియట్

అకౌంటెన్సీ, ఆర్థిక శాస్త్రం, లేదా వ్యాపార రంగం వైపు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ నందు ఎం ఇ సి స్ట్రీమ్ ను ఎన్చుకొనవచ్చును

Subjects M.E.C – సబ్జెక్టులు

  • మాథెమాటిక్స్ A & B
  • ఎకనామిక్స్
  • కామర్స్
  • ఫస్ట్ లాంగ్వేజ్
  • సెకండ్ లాంగ్వేజ్

After M.E.C Higher Education – M.E.C తర్వాత ఉన్నత విద్య:

కామర్స్ & వ్యాపార కోర్సులు: B.Com, B.B.A, B.B.M కోర్సులు నందు ప్రవేశం పొందవచ్చును

ఆర్థిక శాస్త్రం: B.A ఎకనామిక్స్ నందు మరియు
C.A ఫౌండేషన్ పరీక్ష తర్వాత
చార్టెడ్ అకౌంటెన్సీ (CA) కోర్సు నందు ప్రవేశం పొందవచ్చును

Intermediate Education – H.E.C – ఇంటర్మీడియట్

ప్రజా పరిపాలన, సివిల్ సర్వీసెస్, లేదా లా రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్ నందు హెచ్ ఈ సి స్ట్రీమ్ ను ఏంచుకొనవచ్చును

Subjects in H.E.C – సబ్జెక్టులు

  • చరిత్ర
  • ఎకనామిక్స్
  • కామర్స్
  • ఫస్ట్ లాంగ్వేజ్
  • సెకండ్ లాంగ్వేజ్

After H.E.C Higher Education – H.E.C తర్వాత ఉన్నత విద్య:

హ్యూమానిటీస్ & లా కోర్సులు, బి.ఎ రాజకీయ శాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, లేదా LLB నందు ప్రవేశం పొందవచ్చును.సివిల్ సర్వీసెస్: UPSC లేదా రాష్ట్ర సర్వీసుల పరీక్షలకు ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు.

Polytechnic Engineering diploma Courses – పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు

కాల వ్యవధి : మూడు సంవత్సరాలు

విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ అనుభవం ఇవ్వడం లక్ష్యంగా పలు పాలిటెక్నిక్ నందు ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్,సివిల్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదలగునవి ఏంచుకొనవచ్చును

పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షలు

పోలిసెట్ TS POLYCET మరియు AP POLYCET వంటి రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల ద్వారా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సులు నందు ప్రవేశం పొందవచ్చును.

పాలిటెక్నిక్ కోర్సు ద్వారా ఉద్యోగావకాశాలు

విద్యార్థులు జూనియర్ ఇంజనీర్లు లేదా టెక్నీషియన్లుగా ఉద్యోగాలను పొందవచ్చు లేదా B.Tech/B.E రెండవ సంవత్సరంలోకి ప్రవేశం పొందవచ్చను.

Non-Engineering Diploma Course – నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు

కాల వ్యవధి : ఒకటి నుండి మూడు సంవత్సరాలు

క్రియేటివ్ మరియు నాన్-టెక్నికల్ రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు పలు నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి, ఉదాహరణకు ఆర్కిటెక్చర్,
ఇంటీరియర్ డిజైనింగ్,ఫ్యాషన్ డిజైనింగ్,హోటల్ మేనేజ్‌మెంట్ మొదలగునవి.

డిప్లొమా కోర్సులు ద్వారా ఉద్యోగ అవకాశాలు

డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన రంగాలు ఆధారముగా ఉద్యోగాలు పొందవచ్చు లేదా స్వయం ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చును.

After 10th Class Vocational ITI Courses – ఒకేషనల్ ITI కోర్సులు (Industrial Training Institutes)

కాల వ్యవధి : 1 నుండీ 2 సంవత్సరాలు

ITI కోర్సులు నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించి విద్యార్థులకు ఫిట్టర్,ఎలక్ట్రిషన్,వెల్డింగ్,ప్లంబింగ్,కార్పెంట్రీ వంటి రంగాలలో శిక్షణ ను అందిస్తాయి.

ITI ద్వారా ఉద్యోగావకాశాలు

ITI ఇండస్ట్రియల్ ఉత్పత్తి, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. స్వయం ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చును.

After 10th Class Vocational Paramedical Courses – ఒకేషనల్ పారా మెడికల్ కోర్సులు

కాల వ్యవధి : 1 నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది.

ఆరోగ్య సంరక్షణలో విద్యార్థులు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ,రేడియాలజీ,ఫిజియోథెరపీ,డిఫార్మసీ,ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ,ECG టెక్నాలజీ,నర్సింగ్ వంటి కోర్సులు ద్వారా ఆసుపత్రులు, ల్యాబ్స్, క్లినిక్స్‌లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా శిక్షణ పొంది ఆసుపత్రులు,డయాగ్నోస్టిక్ సెంటర్లు,ప్రైవేట్ క్లినిక్స్,ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును.

ప్రముఖ పారా మెడికల్ కోర్సులకు తరచుగా 10వ తరగతి మార్కులు ఆధారంగా ప్రవేశం ఇస్తారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి పారా మెడికల్ అడ్మిషన్ పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నేరుగా విద్యా సంస్థల ద్వారా అడ్మిషన్ పొందవచ్చు.

After 10th Class Skil Development Courses – NSDC – నైపుణ్య అభివృద్ధి కోర్సులు

కాల వ్యవధి : 3 నెలలు నుండి 1 సంవత్సరం ఉంటుంది.

NSDC -నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందించే ఈ షార్ట్-టర్మ్ కోర్సులు వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. వీటిలో డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మొబైల్ రిపేరింగ్, బ్యూటీ థెరపీ వంటి అనేక కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు ద్వార విద్యార్థులు ఆయా రంగాలలో ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి నీ పొందవచ్చును.

ఇంటర్మీడియట్ తరువాత
CUET (Common University Entrance Test) ద్వారా కేంద్ర విశ్వవిద్యాలయాల బోధనా ప్రోగ్రామ్‌లలో ,
NDA (National Defence Academy) ద్వారా భారత రక్షణ దళాలలో మరియు ICAI CPT: Chartered Accountancy (CA) చదవదలచిన విద్యార్థులు కు ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

After 10th Class Government Job Opportunities – పదవ తరగతి తర్వాత గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు

After 10th Class Indian Railways- ఇండియన్ రైల్వేస్

ఇండియన్ రైల్వేస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద గ్రూప్ డి స్థాయి పోస్టుల ద్వారా భారీగా ఉద్యోగ కల్పన చేస్తుంది.

Track maintainer – ట్రాక్ మైంటైనేర్: (After 10th Class)

రైల్వే ట్రాక్లను సక్రమంగా మెయింటైన్ చేయడానికి ఈ పోస్ట్ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తుంది.

Helper/Assistant – హెల్పర్/ అసిస్టెంట్: (After 10th Class)

ఎలక్ట్రికల్, మెకానికల్ ,సిగ్నల్ &టెలికాం లాంటి వివిధ డిపార్ట్మెంట్స్ లో సీనియర్ స్టాఫ్ కి సహాయం చేయడానికి ఈ పోస్టులో ఉద్యోగ కల్పన చేస్తుంది.

Points Man – పాయింట్స్ మెన్ (After 10th Class)

రైల్వే పాయింట్స్ ని కంట్రోల్ చేయటం మరియు ట్రైన్ ఆపరేషన్స్ లో సహాయం చేయటానికి ఈ పోస్టుల నందు ఉద్యోగ కల్పన చేస్తుంది

రైల్వేలో ఈ గ్రూప్ డి స్థాయి పోస్టుల్లో ఉద్యోగం పొందడం కోసం పదవ తరగతి పాస్ అయ్యి వారి వయసు 18 నుంచి 33 సంవత్సరాలు వయస్సు మధ్య ఉంటే సరిపోతుంది. ఈ వయసు అనేది పోస్ట్ యొక్క కేటగిరీ ఆధారము చేసుకుని కొన్ని మార్పులు ఉంటాయి. ఈ ఉద్యోగం కోసం ఆర్ఆర్బీలో గ్రూప్ డి ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ రాయటానికి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ ,జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్ వంటి సబ్జెక్టుల మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.ఇందులో జాబ్ టైప్ నీ బట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET )కూడా ఉంటుంది. రైల్వేస్ లో ఈ గ్రూప్ డి పోస్టులకి జీతం ₹18000 నుండి ₹22,000 వరకు ఉంటుంది.

After 10th Class Staff Selection Commission – స్టాఫ్ సెలక్షన్ కమిషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఎంట్రీ లెవెల్ గవర్నమెంట్ పొజిషన్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టుల నందు ఉద్యోగ కల్పన చేస్తుంది.

After 10th Class Multi-Tasking Staff (MTS)- మల్టీ టాస్కింగ్ స్టాఫ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రంగాల్లో క్లీనింగ్, మెయింటినెన్స్ మరియు సపోర్ట్ రోల్స్ కోసం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వారి వయసు 18 నుండి 25 సంవత్సరాలు మధ్య (క్యాటగిరి ని బట్టి మార్పు ఉండొచ్చు) ఉన్నవారికి ఎం టి ఎస్ ఎగ్జామ్ టైర్ వన్ కేటగిరీలో కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ను జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్,ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ లో మరియు టెర్ టూ కేటగిరీలో డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ లేదా లోకల్ లాంగ్వేజ్ లో షార్ట్ ఎస్సేలు/ లెటర్స్ రాయటం వంటి ఎగ్జామ్ ను కండక్ట్ చేసి అర్హులైన వారికి ఈ పోస్టుల నందు ఉద్యోగాల కల్పన చేస్తుంది. ఈ జాబ్స్ నందు నెల వారి జీతము ₹18,000 నుండి ₹25,000 వరకు ఉంటుంది.

Constable (GD)- జి డి కానిస్టేబుల్ (After 10th Class)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో బి ఎస్ ఎఫ్, సి ఐ ఎస్ ఎఫ్, సి ఆర్ పి ఎఫ్ వంటి రంగాల్లో సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. ఈ జాబ్స్ కోసం టెన్త్ క్లాస్ పాస్ అయిన 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు (కేటగిరి ని బట్టి మారవచ్చు)మధ్య వయసుగల వారికి కానిస్టేబుల్ జీడి ఎగ్జామ్ ను రిటన్ టెస్ట్ ద్వారా జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ ,జనరల్ నాలెడ్జి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు లేదా హిందీ లేదా లోకల్ లాంగ్వేజ్ లో నిర్వహించి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)ని రన్నింగ్ ,హై జంపు, లాంగ్ జంప్ లాంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు లను నిర్వహించి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ను కంటి చూపు , వినికిడి మరియు ఇతర ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించి అర్హులు అయిన వారికి ఉద్యోగ కల్పన చేస్తుంది. ఈ కానిస్టేబుల్ జిడి పోస్ట్ కి జీతం ₹21,700 నుంచి ₹69,1000 వరకు ఉంటుంది.

Defence Jobs – డిఫెన్స్ జాబ్స్ (After 10th Class)

డిఫెన్స్ రంగములో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో టెన్త్ క్లాస్ పాస్ అయిన వారికి ఎంట్రీ లెవెల్ మరియు ట్రేడ్స్ మెన్ రోల్స్ కి జాబ్స్ ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో బేసిక్ సోల్జర్ రోల్ అయినటువంటి సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) పోస్టు మరియు ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్ లో కుక్కు , వాషర్ మెన్, బార్బర్ లాంటి జాబుల భర్తీ కోసం టెన్త్ క్లాస్ పాస్ అయి 17 సంవత్సరాల ఆరు నెలలు నుండి 23 సంవత్సరాలు మధ్య వయసు గల వారికి రిటన్ ఎగ్జామ్ ను బేసిక్ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్,j జనరల్ నాలెడ్జిలు నందు నిర్వహించి తర్వాత ఫిజికల్ టెస్ట్ ను రన్నింగ్, పుల్లప్స్ , బ్యాలెన్స్ మరియు ఇతర ఫిజికల్ టాస్కులు నిర్వహించి తర్వాత మెడికల్ ఎగ్జామ్ ను హైట్, వెయిట్, మరియు ఇతర మెడికల్ పరీక్షలు నిర్వహించి అర్హులు అయిన వారికి ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది. దీనిలో జనరల్ సోల్జర్ కి జీతం ₹21,700 వరకు ట్రేడ్స్ మెన్ పోస్ట్ కి ₹18000 నుండి ₹22,000 వరకు ఉంటుంది.

After 10th Class Indian Postal Services – ఇండియన్ పోస్టల్ సర్వీసెస్

ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, గ్రామీణ డక్ సేవక్ జిడిఎస్ పోస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ వర్క్ చేయడానికి లెటర్స్ ని డెలివరీ చేయడానికి, పోస్ట్మాన్ పోస్టు ద్వారా పోస్టులను డెలివరీ చేస్తూ పోస్టల్ ఆపరేషన్ ఆపరేషన్ నందు సహాయం చేయటానికి, ఎం టి ఎస్ పోస్టు ద్వారా ఆఫీస్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ చేయడానికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గలవారికి టెన్త్ క్లాస్ నందు వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని మెరిట్ ఉన్నవారికి ఉద్యోగ కల్పన చేస్తుంది. ఈ జిడిఎస్ ఎంపిఎస్ మరియు పోస్ట్మాన్ పోస్టులకు జీతము 10,000 నుండి 14,500 వరకు ఉంటుంది.

After 10th Class State Government Jobs – స్టేట్ గవర్నమెంట్ జాబ్స్

స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లలో ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నందు ప్యూన్ లేదా ఆఫీస్ అసిస్టెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ మరియు సెక్యూరిటీ రూల్స్ కోసం పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ ప్రొడక్షన్ మరియు పెట్రోలింగ్ డ్యూటీ కోసం ఫారెస్ట్ గార్డు పోస్టులను టెన్త్ క్లాస్ పాస్ అయ్యి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు గలవారికి స్టేట్ యొక్క నియమాలకు అనుకూలంగా ప్రకటిని ఎగ్జామ్ మరియు ఫిజికల్ టెస్ట్ లేదా మెరిట్ ఆధారంగా పరీక్షలు నిర్వహించి అర్హులు అయిన వారికి ఉద్యోగ కల్పన చేయటం జరుగుతుంది. ఈ పోస్టులకు 15000 నుండి 25 వేల వరకు జీతం ఉంటుంది.

After 10th Class Public Sectors Undertakings (PSUs) – పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎన్టిపిసి, బీహెచ్ఈఎల్, ఓఎన్జిసి వంటి సంస్థల్లో ఎంట్రీ లెవెల్ టెక్నీషియన్స్ మరియు నాన్ టెక్నికల్ రోల్స్ లో బేసిక్ మెయింటినెన్స్ మరియు సపోర్ట్ కోసం అటెండెంట్ లేదా హెల్పర్ జాబు, ఎంట్రీ లెవెల్ టెక్నికల్ అసిస్టెన్స్ కోసం అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ జాబ్ కొరకు 10వ తరగతి పాస్ అయి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారికి రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా పరీక్షలు నిర్వహించి అర్హులు అయిన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ జాబ్ నందు 15000 నుండి 20000 వరకు నెలవారి జీతం అందించడం జరుగుతుంది.

After 10th Class Border Security Force (BSF), CISF and Other Paramilitary Forces – బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (బి ఎస్ ఎఫ్), సి ఐ ఎస్ ఎఫ్ మరియు ఇతర పారా మిలిటరీ ఫోర్సెస్

పారా మిలటరీ ఫోర్సెస్ ఎంట్రీ లెవెల్ పోస్టుల్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసున్న వారిని కేటరింగ్, హౌస్ కీపింగ్, క్రాఫ్ట్స్ వంటి జాబ్స్ కోసం జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్ లో రిటన్ ఎగ్జామ్ నిర్వహించి తర్వాత రన్నింగ్ ,లాంగ్ జంప్, హై జంపు లాంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించి తర్వాత ఫిట్నెస్ కు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ జాబ్ నందు నెలవారి జీతము 21,700 నుండి 69 వేల 100 వరకు పోస్టును బట్టి ఉంటుంది.

After 10th Class Jobs in Banking Sector – బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు

రీజినల్ రూరల్ మరియు కోపరేటివ్ బ్యాంక్ లలో ఎంట్రీ లెవెల్ జాబ్స్ భర్తీకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు మధ్య వయసున్న వారిని ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, స్వీపర్ జాబుల కోసం అవసరమైతే రిటన్ టెస్ట్ లేదా మెరిట్ బేస్ మీద ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఈ జాబ్ నందు నెలవారి జీతం ₹10,000 నుండి ₹15,000 వరకు ఉంటుంది.

CLOSING SENTENCE – ముగింపు వాక్యం

After 10th Class – 10 వ తరగతి తరువాత
భారత విద్యా వ్యవస్థ పైన తెలిపిన అవకాశాలు ద్వారా విద్యార్థులకు తగిన విద్యా మార్గాన్ని ఎంచుకునే అవకాశం కలిగించటం జరుగుతుంది. విద్యార్థులు తమ ఆసక్తులు, నైపుణ్యాలు, మరియు భవిష్యత్తు లక్ష్యాల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.సాధారణంగా టెన్త్ క్లాస్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు రిటెన్ ఎగ్జామ్ కోసం జనరల్ అవేర్నెస్ లో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ,కరెంట్ అఫైర్స్, బేసిక్ సైన్స్, మ్యాథమెటిక్స్ లో అర్థమెటిక్, ఆల్జీబ్రా, పర్సంటేజ్స్, ఎవరేజస్, రేషియోస్, రీజనింగ్ లో వెర్బల్ ,నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ అనాలసిస్ జనరల్ ఇంగ్లీష్ లో బేసిక్ గ్రామర్ , కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ వంటి అంశాలను నందు పూర్తి అవగాహనను కలిగి ఉండవలెను.

వీటితోపాటు డిఫెన్స్ రంగంలో జాబులు కోసం ప్రయత్నం చేసేవారు ఫిజికల్ ఫిట్నెస్ లో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం రన్నింగ్ , పుష్ అప్స్, ఫుల్ అప్స్, లాంగ్ జంపు, హై జంపు వంటివి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మరియు మెడికల్ ఫిట్నెస్ లో భాగంగా విజన్, వల్ల హీరింగ్, హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ మరియు టోటల్ బాడీ ఫంక్షన్నింగు క్రమబద్ధంలో ఉండేటట్లు చూసుకోవాలి.

SHORT QUIZ ON AFTER 10TH CLASS HIGHER EDUCATION AND GOVERNMENT JOB OPPORTUNITIES

1. Which course focuses on practical engineering skills after the 10th class Education?
10వ తరగతి తర్వాత ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను అభ్యసించే కోర్సు ఏది?

A. Intermediate (MPC) – ఇంటర్మీడియట్ (ఎంపీసీ)
B. Polytechnic Diploma – పాలిటెక్నిక్ డిప్లొమా
C. ITI Vocational Courses – ఐటిఐ వృత్తి కోర్సులు
D. NSDC Skill Development Courses – ఎన్ఎస్డిసి నైపుణ్య అభివృద్ధి కోర్సులు

Correct Answer: B. Polytechnic Diploma – పాలిటెక్నిక్ డిప్లొమా

2. What is the primary entrance exam for admission into medical courses like MBBS after Intermediate Bi.P.C?
ఇంటర్మీడియట్ బైపిసికి తర్వాత ఎంబిబిఎస్ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ప్రాథమిక ప్రవేశ పరీక్ష ఏది?

A. JEE Main
B. NEET
C. POLYCET
D. CLAT

Correct Answer: B. NEET

3. Which stream in Intermediate is suitable for students interested in Economics and Business?
ఆర్థిక శాస్త్రం మరియు వ్యాపారంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన ఇంటర్మీడియట్ స్ట్రీమ్ ఏది?

A. H.E.C
B. M.E.C
C. Bi.P.C
D. C.E.C

Correct Answer: B. M.E.C

4. What is the full form of “SSC”?
“SSC” యొక్క పూర్తి రూపం ఏమిటి?

A. Secondary School Certificate – ద్వితీయ శ్రేణి పాఠశాల సర్టిఫికేట్
B. Senior Secondary Certificate – సీనియర్ సెకండరీ సర్టిఫికేట్
C. State School Certificate – స్టేట్ స్కూల్ సర్టిఫికేట్
D. Secondary State Certificate – ద్వితీయ రాష్ట్ర సర్టిఫికేట్

Correct Answer: A. Secondary School Certificate – ద్వితీయ శ్రేణి పాఠశాల సర్టిఫికేట్ (10th Class)

5. Which government job requires candidates to pass the Group D exam conducted by Indian Railways?
భారతీయ రైల్వే నిర్వహించే గ్రూప్ D పరీక్షను అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన ప్రభుత్వ ఉద్యోగం ఏది?

A. Postal Assistant – పోస్టల్ అసిస్టెంట్
B. Track Maintainer – ట్రాక్ మెయింటైనర్
C. MTS (Multi-Tasking Staff) – ఎంటీఎస్ (మల్టీ-టాస్కింగ్ స్టాఫ్)
D. GD Constable – జీడీ కానిస్టేబుల్

Answer: B. Track Maintainer – ట్రాక్ మెయింటైనర్

Vipstudent.online

Welcome to Vipstudent.Online - The Future Of The Nation! Vipstudent.online is an exclusive career growth platform and community for students and individuals to empower themselves by enhancing their educational and professional skills and knowledge.

Leave a Comment