Lets Know About Group 1 Jobs and Job Roles (Government) – గవర్నమెంట్ గ్రూప్ 1 ఉద్యోగాలు మరియు విధులు గురించి తెలుసుకుందాము:
Group 1 Jobs and Job Roles : గ్రూప్ వన్ ఉద్యోగాలు అయినటువంటి కలెక్టర్ / ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ మరియు సివిల్ సర్వీస్ ఆఫీసర్ అవ్వడానికి యుపిఎస్సి (UPSC)నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నందు అర్హత సాధించి ఉద్యోగం పొందవచ్చును. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నందు ఉండే దశలు, కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ , వయోపరిమితి, దరఖాస్తు చేసుకునే విధానము, సెలక్షన్ ప్రాసెస్, ట్రైనింగ్ ప్రాసెస్, సివిల్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విధానము , సబ్జెక్టులు గురించి మరియు కలెక్టర్/ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ యొక్క విధులు మరియు బాధ్యతలు గురించి పూర్తిగా ఈ బ్లాగ్ ను చదివి తెలుసుకుందాము.
SUCCESS IN CAREER / భవిష్యత్తు నందు విజయం : ప్రతీ విద్యార్థి వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించటానికి మరియు కెరియర్ నందు విజయవంతంగా స్థిరపడటానికి అకాడమిక్స్(Acadamics) అనగా పుస్తకాలలో ఉండే నాలెడ్జ్ తో పాటు జనరల్ స్టడీస్ (General Studies), టెక్నాలజీస్ (Technologies), హిస్టరీ (History), రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు ( International, National, State Current Affairs), వృత్తి పరమయిన స్కిల్స్ (Professional Skills), బిజినెస్ స్కిల్స్ (Business Skills), ఆర్థిక అంశాల నిర్వహణ స్కిల్స్ (Economic Management Skills), పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ (Personality Development Skills) నందు కూడా మీ జనరల్ నాలెడ్జ్ ను పెంపొందించుకొని విద్యార్థి దశ నుండే విజయం వైపు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.
To Become a Collector/ IAS, IPS, IFS, IRS And Civil Service Officer Required Educational Qualification / కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ మరియు సివిల్ సర్వీస్ ఆఫీసర్ అవ్వటానికి కావలసిన విద్యా అర్హత (ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్):
భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ) నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పొంది ఉన్నవారు దరఖాస్తు చేసుకోనవచ్చును. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకొన వచ్చును.UPSC పరీక్ష రాయడానికి కనీస మార్కుల శాతం అవసరం లేదు. డిగ్రీ నందు ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.
Age Limit and Attempts – వయోపరిమితి మరియు ప్రయత్నాలు
దరఖాస్తు చేసుకునే నాటికి సాధారణ కేటగిరీకి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వేర్వేరు కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంటుంది.OBC లకు 3 సంవత్సరాల సడలింపు (35 సంవత్సరాలు వరకు) ఉంటుంది.SC/ST లకు 5 సంవత్సరాల సడలింపు (37 సంవత్సరాలు వరకు) ఉంటుంది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నందు సాధారణ కేటగిరీ వారు ఆరుసార్లు ప్రయత్నాలు చేయవచ్చును.OBC కేటగిరి వారు వారు 9 సార్లు ప్రయత్నాలు చేయవచ్చును.SC/ ST క్యాటగిరి వారు వారికి ఉన్న వయోపరిమితి లోపు ఎన్నిసార్లు అయినా ప్రయత్నం చేయవచ్చును.
Apply for the Civil Services Examination (సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విధానం)
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. UPSC అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవలిసి ఉంటుంది.
Stages of the UPSC Civil Services Examination – UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష దశలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE) ను మూడు దశలుగా నిర్వహించడం జరుగుతుంది.
- 1.Preliminary Examination (ప్రిలిమినరీ పరీక్ష)
- 2.Main Examination (మెయిన్స్)
- 3.Personality Test – Interview (పర్సనాలిటీ టెస్ట్ – ఇంటర్వ్యూ)
Preliminary Examination (ప్రిలిమినరీ పరీక్ష)
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నందు స్క్రీనింగ్ పరీక్షలు ద్వారా అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి:
జనరల్ స్టడీస్ పేపర్ I: నందు చరిత్ర, భూగోళశాస్త్రం, రాజ్యాంగం, ఆర్థిక శాస్త్రం, పర్యావరణం, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలు మీద పరీక్ష ఉంటుంది.
జనరల్ స్టడీస్ పేపర్ II (CSAT) నందు యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్ మొదలైన వాటి మీద పరీక్ష ఉంటుంది.
ప్రిలిమ్స్ మొత్తం 400 మార్కులకు ఉంటుంది (పేపర్ I: 200 మార్కులు, పేపర్ II: 200 మార్కులు).
ఈ రెండు పేపర్లు ఆబ్జెక్టివ్-టైప్ (మల్టిపుల్ చాయిస్)ప్రశ్నలుగా ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నందు ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే; ఈ ఎగ్జామ్స్ నందు కనీసం 33 శాతం మార్కులను పొందాలి. దీనిలో వచ్చే మార్కులు తుది ర్యాంకుల్లో లెక్కించరు. ప్రిలిమ్స్ నందు అర్హత సాధించిన వారు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అవ్వగలరు.
Main Examination (మెయిన్స్ పరీక్ష):
మెయిన్స్ నందు తొమ్మిది పరీక్ష పేపర్లు ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ మొత్తం 1750 మార్కులుకు ఉంటుంది. ఇందులో ఒక ఎస్సే పేపర్,నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు,రెండు ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు (మీకు ఇష్టమైన సబ్జెక్టు ఎంచుకోవచ్చు),రెండు అర్హత భాషా పేపర్లు (ఒక భారతీయ భాష మరియు ఇంగ్లీష్) ఉంటాయి.
మెయిన్స్ దశ లోని పరీక్షలు అభ్యర్థి యొక్క అకాడమిక్ జ్ఞానం మరియు ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ఇది తుది ర్యాంకింగ్ నీర్ణయించడానికి ముఖ్యమైనది.
1.పేపర్ A నందు భారతీయ ప్రాంతీయ భాషను ఎంచుకొని అర్హత పరీక్ష రాయవలసి ఉంటుంది.
2.పేపర్ B లో ఇంగ్లీష్ – ఇంగ్లీష్ భాషా నైపుణ్యాల నందు అర్హత పరీక్ష రాయవలసి ఉంటుంది
3.పేపర్ I: ఎస్సే రైటింగ్ – అభ్యర్థులు కొన్ని అంశాలపై ఎస్సే రాయాలి, దీని ద్వారా వారి సృజనాత్మకత మరియు ఆలోచనా సామర్థ్యం అంచనా వేయడం జరుగుతుంది.
4.5.6.7.: పేపర్లు II-V: జనరల్ స్టడీస్ (GS) – ఈ నాలుగు పేపర్లు నందు భారతీయ వారసత్వం, సంస్కృతి, చరిత్ర, భూగోళశాస్త్రం,ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు,సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి, జీవావలోకనం, పర్యావరణం, భద్రత, విపత్తుల నిర్వహణ,నైతికత, సమగ్రత మరియు యాప్టిట్యూడ్ వంటి అంశాల మీద పరీక్షలు రాయవలసి ఉంటుంది.
8.9: పేపర్లు VI మరియు VII: ఆప్షనల్ సబ్జెక్ట్ – అభ్యర్థి తనకు పూర్తి అవగాహన కలిగిన మరియు ఇష్టమైన ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకొని అందులో రెండు పరీక్షలు రాయవలసి ఉంటుంది. మెయిన్స్‌లో పొందిన మార్కులు (అర్హత భాషా పేపర్లను మినహాయించి) తుది ర్యాంకులలో లెక్కించబడతాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ నందు అర్హత సాధించిన వారు తుది పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకు క్వాలిఫై అవుతారు.
Personality Test (పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ)
మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత UPSC బోర్డు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
పర్సనాలిటీ టెస్ట్ అనేది ఎంపిక ప్రక్రియ యొక్క తుది దశ. ఇందులో అభ్యర్థి ఒక బోర్డు సభ్యుల సమక్షంలో ఇంటర్వ్యూ కోసం హాజరు అవుతారు. ఈ ఇంటర్వ్యూ నందు అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం, మానసిక స్పష్టత, సమాజానికి సంబంధించిన ఆలోచనలు, సామాజిక నైపుణ్యాలను పరీక్షించడం జరుగుతుంది.పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది.
Final Merit List (తుది మెరిట్ జాబితా)
తుది మెరిట్ జాబితా, మెయిన్స్ (1750 మార్కులు) మరియు ఇంటర్వ్యూ (275 మార్కులు) నుంచి పొందిన మార్కుల ఆధారంగా తయారవుతుంది, మొత్తం 2025 మార్కులు కు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అభ్యర్థులు వారికి వచ్చిన స్కోరును బట్టి ర్యాంక్ పొందుతారు మరియు వారి ప్రాధాన్యత మరియు ర్యాంకు ఆధారంగా వివిధ సివిల్ సర్వీసులు కేటాయించబడతాయి.
Clearing the Examination and Selection (పరీక్షలో ఉత్తీర్ణత మరియు ఎంపిక)
సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ద్వారా వచ్చిన మార్కులు మరియు ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులు వివిధ సివిల్ సర్వీసుల్లో నియమించబడతారు. ఈ సర్వీసులు మూడు విభాగాల్లో విభజించబడతాయి – ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-A మరియు గ్రూప్-B సర్వీసెస్ లు.
1. All India Services (ఆల్ ఇండియా సర్వీసెస్)
Indian Administrative Service (IAS): ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) సేవా విభాగం ద్వారా నియమితులైన అభ్యర్థులు ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పోస్ట్‌లు, మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పని చేస్తారు. అభ్యర్థుల ర్యాంక్‌లో సాధారణంగా టాప్‌లో ఉన్నవారికి IAS సర్వీస్ కేటాయించబడుతుంది.
Indian Police Service (IPS): ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కు ఎంపికైన వారుకి పోలీస్ శాఖలో ఉన్నతాధికారులుగా ఉద్యోగ కల్పన జరుగుతుంది. వారు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP), డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG), మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) వంటి పదవులు పొందుతారు.
Indian Forest Service (IFoS): IFoS సర్వీస్‌లో నియమితులైన వారుకి అటవీ సంబంధిత విభాగాలలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, ప్రధానంగా అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణి సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తారు.
2. Central Civil Services (సెంట్రల్ సివిల్ సర్వీసెస్) – Group A
Indian Foreign Service (IFS): ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) సర్వీస్‌కు ఎంపికైన వారు విదేశాంగ శాఖలో పని చేస్తారు. వీరు దౌత్యవేత్తలుగా దేశం తరపున విదేశాలలో పని చేస్తారు.
Indian Revenue Service (IRS): ఇండియన్ రెవెన్యూ సర్వీస్ విభాగం కింద రెండు ముఖ్యమైన విభాగాలు ఉంటాయి:
IRS (Income Tax): ఐఆర్ఎస్ సర్వీస్‌లో ఉద్యోగం పొందిన వారు ఆదాయ పన్ను శాఖలో పని చేస్తారు మరియు ఆదాయ పన్ను విధానం, పన్నుల వసూళ్ల వంటి అంశాలను నిర్వహిస్తారు.
IRS (Customs and Indirect Taxes): ఐఆర్ఎస్ లో ఈ శాఖ నందు ఉద్యోగం పొందిన వారు కస్టమ్స్ మరియు ప్రత్యక్ష పన్నుల విధానం, జీఎస్టీ వసూళ్లు మొదలైనవాటికి సంబంధించిన విధులు నిర్వహిస్తారు.
Indian Audit and Accounts Service (IA&AS): ఈ విభాగం కింద ఉద్యోగం పొందిన వారు కాగ్ (Comptroller and Auditor General of India) కార్యాలయంలో పని చేస్తారు, వారు ప్రభుత్వ ఖాతాలను పరిశీలన చేస్తారు.
గ్రూప్ ఎ కేటగిరీలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నందు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ Indian Railway Traffic Service (IRTS),ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ Indian Defence Estates Service (IDES),ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ Indian Information Service (IIS) మొదలైన వాటిలో నియమితులవుతారు.
3. Central Civil Services – Group B
Group-B సర్వీసులు సాధారణంగా స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో అధికారి స్థాయిలో నియామకాలు అందిస్తాయి. ఇవి గ్రూప్-A కంటే కొన్ని స్థాయిలో తక్కువ అధికారత కలిగినవిగా పరిగణించబడతాయి, కానీ సమర్థమైన ప్రతిష్ఠ మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Allocation Process – కేటాయింపు ప్రక్రియ
అభ్యర్థుల మెరిట్ జాబితా మెయిన్స్ (1750 మార్కులు) మరియు ఇంటర్వ్యూ (275 మార్కులు) నుంచి వచ్చిన మొత్తం 2025 మార్కుల ఆధారంగా తయారవుతుంది.
అభ్యర్థులు కి వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఒప్పంద ప్రాధాన్యతలు అనుసరించి తాము ఎంపిక చేయబడే సర్వీసులకు సంబంధించి ఆప్షన్స్ / ప్రాధాన్యతలను ఎగ్జామినేషన్ ప్రక్రియలో ఇచ్చి ఉంటారు. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి వారికి సర్వీసులను కేటాయించడం జరుగుతుంది / సాధించిన ర్యాంక్ మరియు ప్రాధాన్యతల ఆధారంగా, అభ్యర్థులు వారి మెరిట్ ర్యాంక్‌ను అనుసరించి అందుబాటులో ఉన్న సర్వీసులకు కేటాయించబడతారు.
Rank Importence – ర్యాంక్ ప్రాధాన్యత
సాధారణంగా అత్యుత్తమ ర్యాంక్ సాధించినవారికి IAS సర్వీసు, తరువాత IPS, IFS మరియు ఇతర సెంట్రల్ సర్వీసులు కేటాయిస్తారు.ప్రతీ ర్యాంక్ స్థానానికి సంభందించి కలిగిన ఖాళీలను అనుసరించి కేటాయింపు జరుగుతుంది.ఈ విధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా, అభ్యర్థులు తమ సామర్థ్యంతో మెరిట్ సాధించి వివిధ కీలకమైన మరియు సేవాముఖమైన సర్వీసుల్లో నియమితులవుతారు.
Tips for civil services examination Preparation – సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సూచనలు
1. సిలబస్ అర్థం చేసుకోవడం: UPSC సిలబస్ విస్తృతంగా ఉంటుంది కాబట్టి, దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి.చరిత్ర, భూగోళశాస్త్రం, రాజ్యాంగం, ఆర్థిక శాస్త్రం, పర్యావరణం, కరెంట్ అఫైర్స్,యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్ , భారతీయ వారసత్వం, సంస్కృతి, చరిత్ర, భూగోళశాస్త్రం,ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు,సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి, జీవావలోకనం, పర్యావరణం, భద్రత, విపత్తుల నిర్వహణ,నైతికత, సమగ్రత మరియు NCERT BOOKS (6 నుండీ 12 వ తరగతి వరకు సబ్జెక్టులు)వంటి అంశాల నందు పూర్తి అవగాహన ఉండేవిధంగా అభ్యర్థి యొక్క ప్రిపరేషన్ ప్రణాళికా బద్ధంగా ఉండాలి.
2. స్టడీ ప్లాన్: సివిల్ సర్వీసెస్ నందు విజయం సాధించడానికి క్రమపద్ధతిలో చదవడం చాలా ముఖ్యమైనది. చదువును చిన్న భాగాలుగా విభజించి ఒక మంచి ప్రణాళికతో చదవాలి.
3. పత్రికలు మరియు కరెంట్ అఫైర్స్: ప్రతిరోజు పత్రికలు (The Hindu, Indian Express) వంటివి చదువుతూ మరియు కరెంట్ అఫైర్స్ గురించి ఎప్పటికప్పుడు విషయపరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
4. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ నందు విజయం సాధించడానికి రిటన్ టెస్ట్ మరియు మాక్ టెస్ట్ లను ప్రాక్టీస్ చూస్తూ ఉండాలి. సమయ పరిమితి మరియు పదాల పరిమితిలో సమాధానాలు ఎలా రాయాలో అనేది ప్రాక్టీస్ చేయటం ద్వారా అవగాహన పెంపొందించుకోవాలి.
5. ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ను విధిగా ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ఎగ్జామ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ను డెవలప్ చేసుకోవాలి.
6. ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం మీకు ఇష్టమైన, బాగా అర్థమయ్యే ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకొని దాని నందు పూర్తి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
7. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నందు విజయం సాధించడానికి సరియైన మెంటర్ ని లేదా కోచింగ్ సెంటర్ ని ఎంచుకొని మీ ప్రిపరేషన్‌ను ప్రణాళిక బద్ధంగా కొనసాగించాలి
Rolls and responsibilities of collector/ IAS officer, IPS officer, IRS officer, IFS officer, and other Central service officers కలెక్టర్ / ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఆఫీసర్, మరియు ఇతర కేంద్ర సేవల ఆఫీసర్స్ యొక్క విధులు మరియు బాధ్యతలు:
సివిల్ సర్వీసెస్‌లో ఎంపికైన వారి విధులు మరియు బాధ్యతలు చాలా విస్తృతమైనవి. వీరు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ పదవులను నిర్వహిస్తూ, పాలనా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. సివిల్ సర్వీసెస్‌లో IAS, IPS, IFS, మరియు కేంద్ర గ్రూప్-A మరియు గ్రూప్-B సర్వీసులు ఉన్నాయి. ప్రతి సర్వీసుకు ప్రత్యేకమైన విధులు, బాధ్యతలు ఉంటాయి.
1. Indian Administrative Service (IAS) – ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) Job Roles
ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్‌గా లేదా డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం, శాంతి భద్రతలను పర్యవేక్షించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం మొదలైన బాధ్యతలు ఉంటాయి.ప్రభుత్వ విధానాల రూపకల్పన: రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థాయిలో విధానాలను రూపకల్పన చేయడం మరియు అమలు చేయడం.పన్ను విధానాలు మరియు రెవెన్యూ పర్యవేక్షణ: రెవెన్యూ కలెక్టర్‌గా పన్నుల వసూళ్లను పర్యవేక్షించడం, న్యాయపరమైన ఆదేశాలు అమలు చేయడం.సంక్షేమ కార్యక్రమాల అమలు: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడం, పేదరికం నివారణ, విద్య, ఆరోగ్య సేవల రంగాల్లో మార్పులు తీసుకురావడం వంటి బాధితులు నిర్వర్తించవలసి ఉంటుంది.
2. Indian Police Service (IPS) ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) Job Roles
ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్రాల్లో లేదా జిల్లాలో శాంతి భద్రతను కాపాడడం, చట్టం అమలును పర్యవేక్షించడం,నేరాలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం మరియు నేరస్తులను శిక్షించేందుకు చర్యలు తీసుకోవడం, తీవ్రవాదం, మాఫియా కార్యకలాపాలు, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం,కేంద్రీయ భద్రతా సంస్థలతో పనిచేయడం: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), మరియు ఇతర సంస్థలతో కలిసి పని చేయడం మొదలైన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.
3. Indian Foreign Service (IFS) ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ Job Roles
విదేశీ దేశాలపైన మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలను మెరుగుపరచడం, భారతదేశం తరపున విదేశాలలో దౌత్యవేత్తలుగా సేవలందించడం, వాణిజ్య ఒప్పందాలను కుదించడంలో, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర , ప్రవాస భారతీయుల సమస్యలు పరిష్కరించడం: విదేశాల్లో భారతీయుల సమస్యలను పరిష్కరించడం, సహాయం అందించడం వంటి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.
4. Central Services (కేంద్ర సేవలు) – Group A & B
Indian Revenue Service (IRS) – ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) Job Roles
ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఆదాయ పన్ను, కస్టమ్స్, మరియు జీఎస్టీ వసూళ్లను పర్యవేక్షించడం,టాక్స్ ఇన్వెస్టిగేషన్: పన్ను ఎగవేతను నిరోధించడానికి పర్యవేక్షణ మరియు దర్యాప్తు వంటి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.
Indian Audit and Accounts Service (IA&AS): – ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ సర్వీస్ Job Roles
ప్రభుత్వ ఖాతాలను తనిఖీ చేయడం, సమగ్రతను నిర్ధారించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖర్చులను పారదర్శకంగా నిర్వహించడం వంటి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది
Indian Information Service (IIS): – ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ Job Roles
సమాచార ప్రదర్శన: ప్రభుత్వ విధానాలను ప్రజలకందించడం, మీడియాతో పరస్పర సంబంధాలను మెరుగుపరచడం వంటి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.
Common Duties and Responsibilities of civil service officers – సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ యొక్క సాధారణ విధులు మరియు బాధ్యతలు Job Roles
ప్రజాసేవలు: ప్రజల అవసరాలను గుర్తించడం, ప్రజాసంక్షేమానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం,పాలనా పనులు: రాష్ట్ర స్థాయిలో పాలనా విధానాలను అమలు చేయడం,అత్యవసర పరిస్థితుల్లో స్పందన: భూకంపాలు, వరదలు, లేదా ఇతర విపత్తుల సమయంలో ప్రజల రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవడం,చట్టం మరియు న్యాయం అమలు: చట్టాలను అమలు చేసి, న్యాయ పరిరక్షణ కల్పించడం వంటి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది
సివిల్ సర్వీసెస్‌లో ఎంపికైన ప్రతి అధికారి, వారి సర్వీస్ ప్రొఫైల్, నియామక స్థానం, మరియు ప్రత్యేక విభాగం ఆధారంగా పలు విధుల్ని నిర్వర్తిస్తారు. అందరి లక్ష్యం ప్రజల క్షేమం, అభివృద్ధి మరియు దేశ సురక్షితతను కాపాడటం వంటివి వారి ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి.
GOVERNMENT GROUP 1 JOBS AND JOB ROLES
PRACTICE QUESTIONS TO PARTICIPATE IN MONTHLY KNOWLEDGE TEST QUIZZES – మంత్లీ నాలెడ్జ్ క్విజ్ ల నందు పాల్గొనడానికి క్రింది ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి.
1. What is the minimum educational qualification required to apply for the UPSC Civil Services Examination? సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కి దరఖాస్తు చేయడానికి కనీస విద్యా అర్హత ఏమిటి? ✅ (KT QUIZ JULY 2025 QUESTION)
- a) 10th Pass / 10వ తరగతి ఉత్తీర్ణత
- b) 12th Pass / 12వ తరగతి ఉత్తీర్ణత
- c) Graduate Degree from a recognized university / గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ
- d) Postgraduate Degree / పీజీ డిగ్రీ
2. Which stage of the UPSC Civil Services Examination is conducted as a screening test? UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో స్క్రీనింగ్ పరీక్ష ఏ దశలో నిర్వహించబడుతుంది? ✅ (KT QUIZ JULY 2025 QUESTION)
- a) Main Examination / మెయిన్స్ పరీక్ష
- b) Personality Test / వ్యక్తిత్వ పరీక్ష
- c) Preliminary Examination / ప్రిలిమినరీ పరీక్ష
- d) Final Merit List / తుది మెరిట్ జాబితా
3. Which service is most commonly allocated to candidates securing top ranks in the Civil Services Examination? సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాప్ ర్యాంక్ పొందిన అభ్యర్థులకు సాధారణంగా ఏ సేవ కేటాయించబడుతుంది? ✅ (KT QUIZ JULY 2025 QUESTION)
- a) Indian Police Service (IPS) / ఇండియన్ పోలీస్ సర్వీస్
- b) Indian Administrative Service (IAS) / ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
- c) Indian Foreign Service (IFS) / ఇండియన్ ఫారిన్ సర్వీస్
- d) Indian Forest Service (IFoS) / ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
4. How many papers are there in the UPSC Civil Services Main Examination (excluding qualifying papers)? అర్హత పరీక్షలను మినహాయించి UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి? ✅ (KT QUIZ JULY 2025 QUESTION)
- a) 7 (ఏడు)
- b) 9 (తొమ్మిది)
- c) 6 (ఆరు)
- d) 8 (ఎనిమిది)
5. Which language paper is compulsory as a qualifying paper in UPSC Mains? UPSC మెయిన్స్‌లో తప్పనిసరిగా ఉండే లాంగ్వేజ్ పేపర్ ఏది?
- a) English only / ఇంగ్లీష్ మాత్రమే
- b) Any regional language / ఏదైనా ప్రాంతీయ భాష
- c) English and One Indian Language / ఇంగ్లీష్ మరియు ఒక భారతీయ భాష
- d) Hindi only / హిందీ మాత్రమే
ANSWERS ON ABOVE QUESTIONS – పై ప్రశ్నల సమాధానాలు
-
(c)
-
(c)
-
(b)
-
(a)
-
(c)
To know the Answers Participate in Below Quiz – సమాధానాలు తెలుసుకోవటానికి కింది క్విజ్ లో పాల్గొనండి.
GROUP 1 JOBS AND JOB ROLES : CONCLUSION – ముగింపు వాక్యం
భారతదేశంలో సివిల్ సర్వీసెస్ కు ఎంపిక అవ్వటం అనేది చాలా గౌరవప్రదమైనది మరియు ఉన్నతమైనది. గాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దేశానికి మరియు ప్రజలకు సేవ చేయాలి అని కలలు కనేవారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సిఎస్సి) నందు అర్హత సాధించి జిల్లా కలెక్టర్ /ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మరియు ఇతర సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ గా పదవులను పొంది దేశ సమగ్ర అభివృద్ధిలో భాగము కాగలరు.